Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభాకాంక్షలు సైతం తెలిపిన చంద్రబాబు

Chandrababu Naidu: తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు ఇవే కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ ఉదయం గన్ పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

TDP Chief Chandrababu Naidu greets to the People of Telangana on the State formation day

ఇదే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారాయన. అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ.. గేయం ఇది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అమర వీరుల ఆశయాలు, తెలంగా సమాజం కన్న కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచ వ్యాప్తం కావాలని ఆకాంక్షించారు.

TDP Chief Chandrababu Naidu greets to the People of Telangana on the State formation day

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో నిలవాలని అన్నారు. రాష్ట్రాలు రెండయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే ఆకాంక్ష అని పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని, నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని, మున్ముందు ఆర్థిక అసమానతలను నిర్మూలించి, సమగ్ర సాధికారత సాధించాలని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+