తర్వాత మీ ఇష్టం.. చంద్రబాబు హెచ్చరిక!

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నిర్బంధంలో ఉన్న పార్టీ నాయకులను కోర్టుకు హాజరుపరచకుండా హింసిస్తున్నారని ఆరోపించారు. పుంగనూరులో పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్దారు. విచారణ పేరుతో అరెస్ట్ చేసి కస్టడీలో హింసిస్తున్నారన్నారు.

అరెస్ట్ అయిన పార్టీ కార్యకర్తల నుంచి బలవంతంగా తప్పుడు స్టేట్ మెంట్లపై సంతకాలు తీసుకుంటున్నారని, పుంగనూరులో తప్పులు చేసే ప్రతి అధికారి తర్వాత కాలంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ అరెస్ట్ అయిన కార్యకర్తలకు అండగా ఉంటుందని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

tdp chief chandrababu naidu warning to punganur officers

పుంగనూరు సమీపంలోని భీమగానిపల్లె వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనకు సంబంధించి 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన నాయకులు ఈ యమై చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. అంగళ్లు లో మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారంటూ పార్టీ నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గంటా నరహరి, శ్రీరాం చినబాబుపై హత్యయాత్నం కేసులు నమోదు చేశారు. పుంగనూరులో 5, అంగళ్లులో 2 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. బలహీనమైన నాయకులున్న నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నారు. తన జిల్లాల పర్యటనల్లో గుర్తించిన నియోజకవర్గాలు.. అక్కడి ఇన్ ఛార్జిలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+