వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేతలు ఆ స్థలాన్ని కూడా వదలట్లేదు.. చిత్తూరు జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు లేఖ

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భూకబ్జాలు వ్యవహారం ప్రధాన అంశంగా మారిపోయింది. టిడిపి,వైసిపి నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని చిత్తూరు జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.

Recommended Video

Andhra Pradesh : జగన్ ఇలాకాలో పవన్ పై పోలీసులకు ఫిర్యాదు!! || Oneindia Telugu

చంద్రబాబు నాయుడు ఆయన రాసిన లేఖలో పూతలపట్టు మండలం పాలకూరులో భూ ఆక్రమణలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.పూతలపట్టు మండలంలో వైసీపీ నేతలు గుడిసెలు వేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసిన చంద్రబాబు నాయుడు, ఆక్రమణ దారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు చివరకు పాఠశాల మైదాన స్థలాన్ని కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

 TDP chief Chandrababu naidu writes letter to chittoor collector on ysrcp leaders

వైసీపీ నేతల ఆక్రమణలపై పలు అంశాలను లేఖలో వివరించిన చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో టీడీపీ నేతలు గతంలో అధికారంలో ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు సైతం అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దృష్టి సారించి కఠిన చర్యలకు దిగారు.

English summary
TDP chief Chandrababu Naidu has written a letter to the Chittoor district collector.Chandrababu Naidu, who had complained that YCP leaders were setting up huts and encroaching lands in the Puthalapattu zone, appealed to the Collector to take legal action against the occupiers. Chandrababu Naidu alleged that the YCP leaders were occupying the govt school grounds without even leaving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X