వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క‌రు చాలు.!. ఇద్ద‌రు వ‌ద్దు..!! చంద్రబాబు కొత్త విధానం!!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు రానున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల కోసం కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్ప‌టివర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా పేరున్న సీనియ‌ర్ నేత‌లు త‌మ త‌మ కుటుంబాల త‌ర‌ఫున సీట్లు తీసుకొని రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌నుంచి పోటీచేసేవారు. కానీ ఇక‌నుంచి ఆ ఫార్ములాను చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్ట‌బోతున్నారు. ఎంత‌టి రాజ‌కీయ ఘ‌న‌మైన వార‌స‌త్వం ఉన్నా, చ‌రిత్ర ఉన్నా కుటుంబానికి ఒక్క‌టే సీటును కేటాయించ‌బోతున్నారు. ఈ నిర్ణ‌యాన్ని సీనియ‌ర్ నేత‌ల‌కు సైతం ఇప్ప‌టికే చెప్పేస్తున్నారు.

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు..

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు..


శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు ప్ర‌తి జిల్లాలోను సీనియ‌ర్ నేత‌లు ప‌లువురు తాము పోటీచేయ‌డ‌మే కాకుండా త‌మ త‌మ్ముడో, కుమార్తె, కుమారుడు, బావ‌మ‌రిది, అల్లుడు... ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్ద‌రు చొప్పున పోటీచేసుకుంటూ వ‌స్తున్నారు. దీనివ‌ల్ల ఆశావ‌హుల‌కు, పార్టీ టికెట్ కోసం ఎదురుచూసేవారికి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అంతిమంగా పార్టీకి చేటు తెస్తోంద‌ని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కుటుంబానికి ఒకటే టికెట్ కేటాయించాలనే క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రతిష్టాత్మకంగా.. రానున్న ఎన్నికలు

ప్రతిష్టాత్మకంగా.. రానున్న ఎన్నికలు


రానున్న ఎన్నిక‌లు టీడీపీకి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం కాబ‌ట్టి లోటుపాట్లు ఎక్క‌డున్నా వాటిని స‌రిజేసుకుంటూ వ‌స్తున్నారు. దివంగ‌త ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి ప్ర‌స్తుతం చ‌ట్ట‌స‌భ‌ల‌కు ముగ్గురు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రామ్మోహ‌న్ నాయుడు ఎంపీగా, అచ్చ‌న్నాయుడు, ఆదిరెడ్డి భావానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అశోక్ గ‌జ‌ప‌తిరాజు, ఆయ‌న కుమార్తె అదితి గ‌జ‌ప‌తిరాజు ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీచేశారు.

Recommended Video

Bakkani Narasimhulu ఆ నాడు టిడిపి అలా... ఇప్పుడు తెరాస ఇలా *Telangana | Telugu OneIndia
 గెలుపు గుర్రాలకు సీట్లు కేటాయిస్తారా?

గెలుపు గుర్రాలకు సీట్లు కేటాయిస్తారా?


క‌ళా వెంక‌ట్రావు, ఆయ‌న బంధువు కిమిడి మృణాళిని, అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల సునీత‌, ఆమె త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్‌, జేసీ దివాక‌ర్‌రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, వారి ఇద్ద‌రు కుమారులు, చిత్తూరు జిల్లా నుంచి ఆదికేశ‌వుల‌నాయుడి కుటుంబం, అమ‌ర్నాథ్‌రెడ్డి కుటుంబం, క‌ర్నూలు జిల్లా నంచి భూమా కుటుంబం, కోట్ల కుటుంబం, కేఈ కుటుంబం.. ఇలా అంద‌రూ రెండు సీట్లు ఆవిస్తున్నారు. ఇంత‌కుముందు ఈ కుటుంబాల‌కు రెండేసి చొప్పున సీట్లు ద‌క్కాయి. కానీ ఇక‌నుంచి వారికి ఒక‌ సీటే ఇవ్వాల‌ని చంద్రబాబు నిర్ణ‌యించిన‌ట్లు పార్టీవ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. వీరిలో బ‌ల‌మైన అభ్య‌ర్థులు కూడా ఉన్నారు. ఒక‌టే సీటు కేటాయించాలనే ఫార్ములా కోసం వీరిని ప‌క్క‌న పెడ‌తారా? లేదంటే గెలుపు గుర్రాలుగా ఉంటే సీట్లు కేటాయిస్తారా? అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు.!!

English summary
Telugu Desam Party leader Nara Chandrababu Naidu is going to bring a new policy for his party candidates in the upcoming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X