అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాట వినని నాయకులపై చంద్రబాబు 'టిక్ మార్క్'?

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాల్సిందే. వారికి రెండో ఆప్షన్ లేదు. ఇటువంటి సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన సహజశైలికి భిన్నంగా నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నారు.

నాయకులకు హెచ్చరికలు జారీ

నాయకులకు హెచ్చరికలు జారీ


ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ దాదాపు 130 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను పూర్తిచేశారు. మిగిలినవి 45 నియోజకవర్గాలే. వీటిద్వారా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. సమీక్షలు పూర్తవగానే జిల్లాల పర్యటనను చేపట్టబోతున్నారు. తన సమీక్షల్లో భాగంగా నియోజకవర్గాల్లోని నాయకులకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా వారిలో మాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బాబు వారిని ఎలా ముందుకు నడిపిస్తారా? అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

వారు చెప్పింది బాబు.. బాబు చెప్పింది వారు వినడంలేదు

వారు చెప్పింది బాబు.. బాబు చెప్పింది వారు వినడంలేదు


చంద్రబాబు చెప్పింది వారు వినడంలేదు.. వారు చెబుతున్నది బాబు పట్టించుకోవడంలేదు. తెలుగుదేశం పార్టీకి ఇదొక సమస్యగా మారింది. సమావేశానికి రావాలని కబురు చేస్తున్నప్పటికీ కొందరు డుమ్మా కొడుతున్నారు. ఒక నియోజకవర్గం నుంచి ఒక సీనియర్ నేత తాను రాకుండా తన కుమారుడిని పంపించారు. మరో నియోజకవర్గం నుంచి మరో నేత వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నానంటూ కబురు పంపారు. ఎన్నికల్లో ప్రత్యర్థిపై పోరాడేందుకు ఇప్పటినుంచే అస్త్రాలు సమకూర్చుకొని సిద్ధం కావల్సిన తెలుగు తమ్ముళ్లు అధినేత మాటను పెడచెవిన పెడుతూ సొంత వ్యాపారంలో ఎలా తలమునకలయ్యారో అనేదానికి ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.

 పొత్తుంటే తమ పరిస్థితి ఏమిటి?

పొత్తుంటే తమ పరిస్థితి ఏమిటి?


నియోజకవర్గంలో టికెట్ కోసం ఇద్దరు పోటీపడుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. మరికొన్నింటిలో ముగ్గురు పోటీపడుతున్నారు. జనసేనతో పొత్తు ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. అప్పుడు తమ పరిస్థితి ఏమిటని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమకు సీటు రాదు.. లేకుంటే జనసేనకు కేటాయిస్తారు? అనుకున్న నియోజకవర్గాల్లోని నాయకులు బాబు మాటను పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఇటువంటి నియోజకవర్గాలను చంద్రబాబు ప్రత్యేకంగా టిక్ మార్క్ చేసుకుంటున్నారు. మాట వినని నాయకులున్న స్థానాల్లో చివరి నిముషంలో అనూహ్యంగా అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.!!

English summary
They are not listening to Chandrababu.. Babu is not paying attention to what they are saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X