వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెర‌పైకి 50:50 ఫార్ములా? నో కామెంట్ ప్లీజ్‌..! చంద్ర‌బాబు అంత‌ర్గ‌త ఆదేశాలు?

|
Google Oneindia TeluguNews

పొత్తుల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశంతోపాటు, జ‌న‌సేన శ్రేణుల‌ను కూడా అయోమ‌యానికి గురిచేశాయి. గ‌త రెండు ఎన్నిక‌ల్లో తాను త‌గ్గానంటూ ఈసారి మాత్రం త‌గ్గేది లేద‌ని వ‌ప‌న్ స్ప‌ష్టం చేయ‌డంతో ఇరుపార్టీల మ‌ధ్య పొత్తుల‌పై సందిగ్ధ‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌తో తెలుగుదేశం పార్టీ ఆలోచ‌న‌లో ప‌డింది. పార్టీ అధికార ప్ర‌తినిధుల‌కు, సీనియ‌ర్ నేత‌ల‌కు దీనిపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయొద్దంటూ అంత‌ర్గ‌తంగా పార్టీ ఆదేశాలు జారీచేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని, అప్ప‌టివ‌రకు ఎవ‌రూ పొత్తుల‌పై మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

 తెలుగుదేశం నాయ‌క‌త్వం కింద వెళ‌దాం!!

తెలుగుదేశం నాయ‌క‌త్వం కింద వెళ‌దాం!!

మ‌హానాడుకు ప్ర‌జ‌ల నుంచి ఊహించ‌ని రీతిలో స్పంద‌న రావ‌డం, బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి రాయ‌ల‌సీమ‌లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉర‌క‌లేస్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఇరుపార్టీల‌కు చెందిన ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల మ‌ధ్య స‌వాళ్లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీవైపు ఉన్నార‌ని, వారు టీడీపీని గెలిపించాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్లు పై రెండు కార్య‌క్ర‌మాలు స్ప‌ష్టం చేశాయ‌ని, క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌కు బ‌లం లేక‌పోవ‌డంతో తెలుగుదేశం నాయ‌క‌త్వం కింద వెళ‌దామ‌ని అంటున్నారు. వీటిని జ‌న‌సేన నాయ‌కులు ఖండిస్తున్నారు. త‌మ ఓటుబ్యాంకు ద్వారానే ఈసారి తెలుగుదేశంపార్టీకి విజ‌యం ద‌క్క‌బోతుంద‌నే విష‌యాన్ని గుర్తుచేస్తున్నారు.

 ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల వాగ్బాణాలు

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల వాగ్బాణాలు

నిన్న మొన్న‌టివ‌ర‌కు స‌ఖ్య‌త‌గానే ఉన్న తెలుగుదేశం, జ‌న‌సేన సైనికులు తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లతో ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా అధినాయ‌క‌త్వంతో సంబంధం లేకుండా ఇరు పార్టీల నాయ‌కులు అంత‌ర్గ‌తంగా పొత్తుపెట్టుకొని కొన్నిచోట్ల విజ‌యాలు కూడా కైవ‌సం చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబుకు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని, రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తుంద‌ని టీడీపీ వారు అంటుండ‌గా, ఈసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌నసైనికులు డిమాండ్ చేస్తున్నారు.

 మొద‌టి అవ‌కాశం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇవ్వాలి?

మొద‌టి అవ‌కాశం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇవ్వాలి?

అయితే కొత్త‌గా 50:50 ఫార్ములాను కూడా తెర‌పైకి తెస్తున్నారు. మొద‌టి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత రెండున్న‌ర సంవ‌త్స‌రాలు తెలుగుదేశం పార్టీ చేప‌ట్టాలనే సూచ‌న తెర‌పైకి వ‌స్తోంది. పార్టీ నేత‌లెవ‌రూ 50:50 ఫార్ములాపైకానీ, పొత్తుల‌పైకానీ ఏమీ మాట్లాడ‌వ‌ద్ద‌ని టీడీపీ వారికి అంత‌ర్గ‌తంగా ఆదేశాలందాయి. బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉంటే ఆ పార్టీ ష‌ర‌తులేమిటి? పొత్తు లేకుండా జ‌న‌సేన‌, తెలుగుదేశం క‌లిసివెళితే వీరిద్ద‌రి మ‌ధ్య ఉండే ష‌ర‌తులేమిటి అనేవాటిపై స్ప‌ష్ట‌త రావాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు.!!

English summary
50:50 formula on screen? No comment please ..! Chandrababu's internal orders?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X