అల్లు అర్జున్ ప్రచారంపై చంద్రబాబు ఫైర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది గంటల సమయమే ఉంది. అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముగించాయి. ప్రచారానికి చివరిరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. వాస్తవానికి కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. 2019 ఎన్నికల సమయంలో కూడా బన్నీ కిషోర్ రెడ్డికి మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో దాదాపు 30వేల మెజారిటీతో రవిచంద్ర టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై విజయం సాధించారు.

మరోసారి అదే వ్యూహంతో రవిచంద్ర బన్నీని ప్రచారానికి తీసుకువచ్చారు. మెగా కుటుంబానికి చెందిన హీరోలంతా పవన్ కల్యాణ్ వైపు ఉంటే అల్లు అర్జున్ తమవైపే ఉన్నాడంటూ వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రచారంపై చంద్రబాబు మండిపడ్డారు. అల్లు అర్జున్ కేవలం తన స్నేహితుడి కోసమే ప్రచారం చేయడానికి వచ్చారని, అతని మద్దతు మాత్రం జనసేనకే ఉందన్నారు. కొంతమంది వైసీపీ సైకోలు అల్లు అర్జున్ ను వాడుకుంటున్నారంటూ విమర్శించారు.

tdp chief chandrababu slams ysrcp leaders

ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ కు మద్దుగా వరుణ్ తేజ్, సాయిదుర్గాతేజ్, వైష్ణవ్ తేజ్, జబర్దస్త్ నటులు, నాగబాబు, పృథ్వీరాజ్ తదితరులంతా ప్రచారం నిర్వహించారు. వపన్ కల్యాణ్ ఈసారి కచ్చితంగా అసెంబ్లీలోకి అడగు పెట్టాలనే లక్ష్యంతోనే కుటుంబ సభ్యులంతా కదిలివచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ పరోక్షంగా తమ మద్దతు పవన్ కల్యాణ్ కే అని తెలిపారు. గాజుగ్లాసు గుర్తుకే ఓటు వేయాలంటూ రామ్ చరణ్ ప్రచారం చివరి రోజు పిఠాపురంలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+