వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండవీటి సింహాలు, బొబ్బిలి సింహాలకు నచ్చచెబుతున్న చంద్రబాబు!!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డానికి ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అధికార పార్టీని త‌ట్టుకుంటూ పార్టీని ప‌టిష్ట‌ప‌రుచుకుంటూ చెమ‌టోడుస్తున్న బాబుకు పార్టీలోని సీనియ‌ర్లు స‌హ‌క‌రిస్తున్నారా? అంటే లేదు అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. వ‌రుస‌పెట్టి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ, జిల్లాల‌ వారీగా ప‌ర్య‌ట‌న‌లు చేప‌డుతున్న చంద్ర‌బాబుకు ఆ స‌మ‌యంలో మాత్ర‌మే నేత‌ల నుంచి స‌హ‌కారం అందుతోంది. ఇత‌ర స‌మ‌యాల్లో వారంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

 ఇప్పుడే ఖర్చుపెట్టడం ఎందుకులే అంటున్నారు..

ఇప్పుడే ఖర్చుపెట్టడం ఎందుకులే అంటున్నారు..


నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌ఛార్జిలుగా ఉన్న‌వారు.. బ‌ల‌మైన నేత‌లు వారివారి నియోజ‌క‌వ‌ర్గాలకు కూడా ప‌రిమిత‌మ‌వ‌డంలేదు. పార్టీని ప‌టిష్ట‌ప‌ర‌చ‌డానికి ప్ర‌జ‌లతో మ‌మేక‌మై తిర‌గాలంటూ బాబు ఉద్భోదిస్తున్న‌ప్ప‌టికీ పెడ‌చెవిన పెడుతున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌లు మాత్ర‌మే ప్ర‌జ‌లకు అందుబాటులో ఉంటున్నారు. భ‌విష్య‌త్తులో జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుంది కాబ‌ట్టి అప్పుడు సీటు కేటాయిస్తారో? లేదో? ఇప్పుడే ఖ‌ర్చుపెట్ట‌డం ఎందుకులే అనే ధోర‌ణిలో నాయ‌కులున్నార‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు.

పొత్తులతో సంబంధం లేకుండా పనిచేసుకోండి

పొత్తులతో సంబంధం లేకుండా పనిచేసుకోండి


పొత్తుల‌తో సంబంధం లేకుండా ప‌నిచేసుకుంటూ వెళ్లాల‌ని, వాటిగురించి ఎక్కడా మాట్లాడ‌వ‌ద్దంటూ చంద్ర‌బాబు నేతలకు చెబుతున్నారు. ఆయ‌న వ‌రుస‌గా ఇన్ఛార్జిలతో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. కొంద‌రికి సీట్లు ఖ‌రారు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో నిరంతరం పర్యటిస్తుండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. మీరు పనిచేసుకుంటూ ఉండండి.. ఎక్కడా అన్యాయం జరగదని నచ్చచెబుతున్నారు. కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌లెత్తిన సంఘ‌ట‌న‌ల‌పై ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దిగాయి. రెండురోజులుగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నాయి. నేతలంతా డీజీపీ కార్యాల‌యానికే ముట్ట‌డిగా బ‌య‌లుదేరారు. ఎక్క‌డిక‌క్క‌డ గ్రామాల నుంచి న‌గ‌రాల వ‌ర‌కు పార్టీ నేత‌లంతా కుప్పంలో అధికార పార్టీ తీరుకు నిర‌స‌న‌లు నిర్వ‌హించారు. బాబుకు సంఘీభావంగా రాష్ట్రం మొత్తాన్ని అట్టుడికించారు.

ఆ ఐకమత్యం ఏది?

ఆ ఐకమత్యం ఏది?


ఒక్క‌సారిగా అంత‌టి ఐక‌మ‌త్యం ప్ర‌ద‌ర్శించి వీధుల్లోకి వ‌చ్చి పోరాటాలు చేసిన నాయ‌కులు ఏడాది పొడ‌వునా ఎందుకు చేయ‌డంలేదు? అధికార పార్టీపై ఎందుకు పోరాడటంలేదు? అని పార్టీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎన్నిక‌ల‌కు పార్టీని సిద్ధం చేయ‌డం, బ‌లోపేతం చేయ‌డంతోపాటు అన్నిరకాల హంగులను పార్టీకి అద్దాలని, ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉండ‌టం కూడా క‌లిసి వ‌స్తుంద‌ని, చంద్ర‌బాబుకు సంఘీభావంగా ఎలాగైతే పోరుబాట ప‌ట్టారో పార్టీని ప‌టిష్ట‌ప‌రిచే విష‌యంలో కూడ అదే వైఖ‌రి అవలంబించాల‌ని తెలుగు త‌మ్ముళ్లు కోరుతున్నారు.

English summary
It is made clear that they should constantly tour the constituencies and be accessible to the people.You keep working.. It is said that there will be no injustice anywhere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X