తమిళనాడు వెళుతున్న చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమిళనాడు పర్యటనకు వెళుతున్నారు. రెగ్యులర్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమైన దేవాలయాలను దర్శించుకుంటున్నారు. తాజాగా కాంచీపురం జిల్లాలోని శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి విమానంలో బయలుదేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పెరంబదూర్ ఆలయానికి వెళ్తారు. దర్శనం అనంతరం అక్కడి నుంచి చెన్నై చేరుకొని రాత్రి 8.50 గంటలకు విమానంలో విజయవాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంద్వారా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మను, సింహాచలం నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీశైలం కూడా వెళ్లాల్సి ఉన్నప్పటికీ తుఫాను కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈరోజు తమిళనాడు వెళుతున్నారు. రెండురోజులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. అతి తొందరలోనే చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లబోతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగసభలో జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి పాల్గొంటారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయబోతున్నాయి. దీనికి సంబంధించి ఏయే నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలనే విషయమై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications