Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూటు మార్చిన చంద్రబాబు, టార్గెట్ బీజేపీ వయా సీఎం జగన్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. బీజేపీతో పొత్తు కోరుకున్నా ఆ పార్టీ వైఖరి స్పష్టం కావటంతో ఇక కొత్త రాజకీయం మొదలు పెట్టారు. సీఎం జగన్ లక్ష్యంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. తిరిగి ప్రత్యేక హోదా తెర మీదకు తీసుకొస్తున్నారు. కేంద్రంతో ముఖ్యమంత్రి జగన్ లాలూచీ పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు రాజకీయంగా సీఎం జగన్ పైన విమర్శలు చేస్తూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు బీజేపీని ఇరుకునపెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు. పొత్తులు..ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ చంద్రబాబు రాజకీయం ఆసక్తిగా మారుతోంది.

ఏపీలో పొత్తుల రాజకీయంలో భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి వెళ్లేలా పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యకుడు జేపీ నడ్డా తో మంతనాలు జరిపారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటనకు వస్తున్నారు.

బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన లేదని టీడీపీ , జనసేన నేతల నుంచి అందుతున్న సమాచారం. తాజాగా కేంద్రం ఏపీ విషయంలో తీసుకున్న నిర్ణయాలు.. సీఎం జగన్ కు ఇస్తున్న ప్రాధాన్యత వేళ పొత్తు రాజకీయం ఆసక్తిగా మారుతోంది. చంద్రబాబు మాత్రం బీజేపీ పవన్ ప్రతిపాదన పైన స్పష్టత ఇచ్చే వరకు వేచి చూసే ధోరణిో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Chandrababu

ఇదే సమయంలో చంద్రబాబు తరచూ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ..ఎన్డీఏ లో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కారణంతోనే బయటకు వచ్చారు. బీజేపీ కి దూరం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఏపీలో పరాజయం..కేంద్రంలో తిరిగి మోదీ ప్రధాని అయిన తరువాత ఈ అంశం పైన చంద్రబాబు..పవన్ ఇద్దరూ పెద్దగా ఫోకస్ చేయలేదు.

2014 -15 రెవిన్యూ లోటు పైన తాను ఎన్ని సార్లు విన్నవించినా ఆమోదం తెలపని కేంద్రం..ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధనతో విడుదల చేయటం.. కేంద్రంలోని పెద్దలు సీఎం జగన్ అభ్యర్ధనల పైన సానుకూలంగా స్పందిస్తున్న విధానం పైన టీడీపీ ముఖ్య నేతల్లో చర్చ మొదలైంది. పవన్ ప్రతిపాదించినట్లుగా బీజేపీ తమతో కలిసే అవకాశం లేదనే సంకేతాలుగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

jagan

ఈ సమయంలోనే ప్రత్యేక హోదా..కేసుల మాఫీ అంటూ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుంటూనే పరోక్షంగా బీజేపీని చంద్రబాబు టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. విభజన చట్టంలో అంశాలను నెరవేర్చాల్సిన కేంద్రం పైన జగన్ ఒత్తిడి తేవాల్సిన సమయంలో కేంద్రంతో లాలూచీ పడుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కేంద్రం మెడలు వంచుతానని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేసారు. దీని ద్వారా సీఎం జగన్- బీజేపీ మధ్య బంధం పైన గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ తమ పైన అనుసరించిన విధానాన్నే ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీతో సఖ్యత కోసం చివరి వరకు ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు..ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+