వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ-తెలంగాణ జగడం: ఊహించని ట్విస్ట్.. వైసీపీ విజయసాయిపై టీడీజీపీకి ఫిర్యాదు.. చంద్రబాబు భారీ స్కెచ్.

|
Google Oneindia TeluguNews

ఏడాది కాలంగా అన్నదమ్ముల్లా కనిపించిన ఆంధ్రా-తెలంగాణ మళ్లీ జగడాల బాటపట్టాయా? రెండు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు రేపిన చిచ్చు మరింత పెద్దది కానుందా? కృష్ణ నీళ్ల కోసం ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోన్న తెలంగాణ.. ఇకపై ఏపీని ఇరుకున పెట్టేలా రాజకీయ వ్యూహాలనూ సిద్ధం చస్తోందా? చాలా కాలంగా హైదరాబాద్ లో ఉంటోన్న ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు.. ఇదే అదనుగా భారీ స్కెచ్ ను రూపొందించారా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వినిపిస్తోంది. గడిచిన 10 రోజులుగా రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలు.. గొడవ పెద్దదైందనే సంకేతాలిస్తున్నాయి.

నంబర్-2పై తొలి టార్గెట్..

నంబర్-2పై తొలి టార్గెట్..

నిత్యం చలనశీలంగా ఉండే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. ఊహకందని రీతిలో అప్పటికప్పుడు కొత్త అంశాలు తెరపైకి వచ్చేసి.. క్రమంగా పెద్దవైపోయిన సందర్భాలను మనం గతంలో చాలా చూశాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ సర్కారు తీసుకొచ్చిన జీవో 203ని రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కృష్ణా వాటర్ బోర్డు విచారణ జరుపుతుండగానే.. ఏపీ అధికార పార్టీలో సీఎం జగన్ జగన్ తర్వాత నంబర్-2గా కొనసాగుతోన్న ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో ఓ ఫిర్యాదు నమోదుకావడం కలకలం రేపుతున్నది.

చేయించింది చంద్రబాబే..

చేయించింది చంద్రబాబే..

లాక్ డౌన్ ప్రకటనకు ముందే చంద్రబాబు కుటుంబంతో సహా హైదరాబాద్ కు వచ్చేయడం, ఇక్కణ్నుంచి విమర్శలు చేయడాన్ని అధికార వైసీపీ తప్పుపడుతుండటం తెలిసిందే. ఎంతసేపూ కరోనాపై అవాస్తవాలు మాట్లాడే టీడీపీ అధినేత.. పోతిరెడ్డిపాడు విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. దానిపై క్లారిటీ ఇవ్వకపోగా.. ఏపీ-తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సందర్భంలోనే విజయసాయిపై టీడీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. కేసుల పెరుగుతున్నవేళ ఎంపీ విజయసాయి లాక్ డౌన్ రూల్స్ ను పదే పదే ఉల్లంఘిస్తూ ఏపీ నుంచి హైదరాబాద్ కు తరచూ రాకపోకలు సాగిస్తున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశం. అది చేయించింది చంద్రబాబేనని ఎంపీనే స్వయంగా చెప్పడం గమనార్హం.

కేసీఆర్ వార్నింగ్ నేపథ్యంలో..

కేసీఆర్ వార్నింగ్ నేపథ్యంలో..

కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ చివరిసారిగా నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి పలు కామెంట్లు చేయడం, ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా ఉండాలని, రెండు వైపుల రాకపోకల్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించడం తెలిసిందే. సరిగ్గా ఇదే పాయింటు ఆధారంగా ఇప్పుడు టీడీపీ.. వైసీపీ ఎంపీపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విచిత్ర వాతావరణం నేపథ్యంలో ఈ ఫిర్యాదు ఎటువైపునకు దారి తీస్తుందోననే చర్చ మొదలైంది.

ఫిర్యాదుపై విజయసాయి స్పందన..

ఫిర్యాదుపై విజయసాయి స్పందన..

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం నగుస్తోన్న కీలక సమయంలో.. తనపై తెలంగాణ పోలీసులకు టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. కాలం చెల్లిన ఆలోచనలకు ఎంత పదును పెట్టినా ప్రయోజనం ఉండదు. నేను ఏపీ-తెలంగాణ మధ్య తిరుగుతున్నానని (తెలంగాణ)డీజీపీకి కంప్లయింట్ ఇప్పించావు. మరి నువ్వు మాత్రం వైజాగ్ వెళ్లడానికి డీజీపీని కాకుండా కేంద్రం అనుమతి కోరడమేంటి? నీ డ్రామాలు తెలియనంత అమాయకులెవరూ లేరిక్కడ''అని ఎంపీ దుయ్యబట్టారు.

తెలుగోళ్లు చంపుకోవాలా?

తెలుగోళ్లు చంపుకోవాలా?


ఆంధ్రా-తెలంగాణ మధ్య వివాదంలా కొనసాగుతోన్న పోతిరెడ్డిపాడు అంశాన్ని మరింత రాజకీయం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు జీవోపై తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా మీడియా కుతంత్రాలకు తెరలేపారని, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవాలన్నంత స్థాయిలో అంత్యంత క్రూరంగా రాతలు, ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలంగాణ-ఏపీ అన్నదమ్ముల్లా కలిసుంటాయని ఇద్దరు సీఎంలు చాలా సార్లు చెప్పడం, ఈమధ్యే ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్.. ‘కేసీఆర్-జగన్ అన్నదమ్ములు'అని వ్యాఖ్యానించడం విదితమే.

చంద్రబాబు దొంగ ఏడుపు..

చంద్రబాబు దొంగ ఏడుపు..


పోతిరెడ్డిపాడు ఇష్యూ, తనపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు అంశాలతోపాటు పాత విషయాలను కూడా ఎంపీ విజయసాయి తిరగదోడారు. ‘‘ఇసుక మాఫియాను సృష్టించి నదులను అడుగువరకూ ఊడ్చేసినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ విధించింది నీ హయాంలోనే కదా? ప్రకాశం బ్యారేజిలో 15 ఎకరాల కృత్రిమ ద్వీపం ఏర్పాటుకు డ్రెడ్జింగుకు అనుమతిందీ నువ్వే. ఇప్పుడు మడ అడవుల పేరుతో పర్యావరణం ఖూనీ అని దొంగ ఏడుపులేడుస్తున్నావు''అని బాబుపై మండిపడ్డారు. 23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే.. చంద్రబాబు తన పరిపాలనను తానే మెచ్చుకుంటుండటం హాస్యాస్పదంగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు.

English summary
while water war going between andhra and telangana, opposition tdp complaints to telangana dgp on ysrcp mp vijaya sai reddy movements during lockdown. vijaya sai reddy slams chandrababu on this issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X