వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈరోజే!:ఉదయం టీడీపీ సమన్వయ కమిటీ...మధ్యాహ్నం ఎపి మంత్రివర్గ సమావేశం

|
Google Oneindia TeluguNews

అమరావతి:బుధవారం టిడిపికి సంబంధించి రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. తొలుత తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం ఉదయం జరగనుంది. అలాగే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మంత్రిమండలి సమావేశం జరగనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించే ఈ కేబినెట్ మీటింగ్ లో ముందుగా ఇటీవల మావోల కాల్పుల్లో ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలకు సంతాపం తెలపనున్నారు. అలాగే గత కేబినెట్‌లో ఆమోదం పొందని విషయాలపై ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది.

TDP Coordination Meeting and AP Cabinet Today

తొలుత ఉదమాన్నే జరిగే టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో తెలుగు దేశం పార్టీకి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చ జరపడంతో పాటు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపక్షాల నిలువరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరపనున్నట్లు తెలిసింది.

మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ మీటింగ్ లో ముందుగా మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాలకు మంత్రిమండలి సంతాపం తెలపనుంది. అనంతరం వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటనపై కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

అనంతరం గత కేబినెట్‌లో ఆమోదం పొందని పలు అంశాలపై తాజా సమావేశంలో చర్చించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే గ్రామదర్శిని, పలు అభివృద్ధి పథకాల అమలుపై చర్చతోపాటు, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ లో చర్చించనున్నారు. వీటితో పాటుగా పలు కంపెనీలకు భూకేటాయింపులపై ఎపి కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం.

English summary
Amaravathi:Two key meetings related to TDP will be held on today.  The first meeting is Party Coordination Committee will held on morning and AP Cabinet meeting will be held at 3 pm on the evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X