చల్లారని అసమ్మతి: రొటేషన్ పద్దతిలో బెజవాడ మేయర్ పదవివ్వాలి, టిడిపికి తలనొప్పి

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, టిడిపి కార్పోరేటర్ల మధ్య తలెత్తిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. మేయర్‌ పదవి నుండి శ్రీధర్‌ను తప్పించాలని టిడిపి కార్పోరేటర్లే డిమాండ్ చేస్తున్నారు. టిడిపి కార్పోరేటర్లతో బుదవారం నాడు బుద్దా వెంకన్న సమావేశమయ్యారు. రోటేషన్‌ పద్దతిలో మేయర్‌ను పదవిని కట్టబెట్టాలని టిడిపి కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. కార్పోరేటర్ల డిమాండ్‌ను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు.

విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ తీరుతో స్వపక్షానికి చెందిన కార్పోరేటర్లే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మేయర్ శ్రీధర్ నోటి దురుసు కారణంగానే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని కార్పోరేటర్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే నగర మేయర్ కోనేరు శ్రీధర్‌ను పదవి నుండి తప్పించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చక్రం తిప్పుతున్నారనే శ్రీధర్ అనుమానిస్తున్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడ కార్పోరేషన్ రంజుగా మారింది.

విజయవాడ కార్పోరేషన్‌లో అసమ్మతి పోరు

విజయవాడ కార్పోరేషన్‌లో అసమ్మతి పోరు

విజయవాడ కార్పోరేషన్‌లో టిడిపి కార్పోరేటర్లకు , మేయర్‌ కోనేరు శ్రీధర్‌కు మధ్య అసమ్మతి పెరిగిపోయింది. ఈ అసమ్మతి కారణంగానే మేయర్‌పై కార్పోరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శ్రీధర్‌ను మేయర్‌ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా కార్పోరేటర్లు మేయర్‌ శ్రీధర్‌పై బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసంతృప్త కార్పోరేటర్లతో టిడిపి నాయకత్వం చర్చలు జరుపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తో కార్పోరేటర్లు సమావేశమయ్యారు. బుదవారం నాడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను కార్పోరేటర్లు పార్టీ ప్రతినిధులకు వివరించారు.

కులాల వారీగా రొటేషన్ పద్దతిలో మేయర్ పదవి ఇవ్వాలి

కులాల వారీగా రొటేషన్ పద్దతిలో మేయర్ పదవి ఇవ్వాలి

కులాల వారీగా రొటేషన్ పద్దతిలో మేయర్ పదవిని ఇవ్వాలని టిడిపి కార్పోరేటర్లు తమ అభిప్రాయాలను బుదవారం నాడు బుద్దా వెంకన్నకు వివరించారు. మేయర్ పదవి నుండి శ్రీధర్‌ను తప్పిస్తేనే ప్రయోజనంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. లేకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. కార్పోరేటర్లు. ఈ నేపథ్యంలో రొటేషన్ పద్దతిలో మేయర్ పదవిని కేటాయిస్తే నష్టం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మేయర్ శ్రీధర్ వర్గీయులమిదే

మేయర్ శ్రీధర్ వర్గీయులమిదే

కార్పోరేటర్లు అసమ్మతి గళం విన్పించడం వెనుక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఉన్నాడనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ చక్రం తిప్పడం వల్లే కార్పోరేటర్లు అసమ్మతి గళం విన్పిస్తున్నారని మేయర్ శ్రీధర్ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. అయితే మేయర్ శ్రీధర్ నోటీ దురుసు కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని కార్పోరేటర్లు అబిప్రాయపడుతున్నారు.

మేయర్‌ను మారిస్తే ప్రభావం ఎలా ఉంటుంది

మేయర్‌ను మారిస్తే ప్రభావం ఎలా ఉంటుంది

విజయవాడ మేయర్‌గా ప్రస్తుతం ఉన్న కోనేరు శ్రీధర్ స్థానంలో మరొకరిని మేయర్‌గా రంగంలోకి దించితే పరిస్థితులు ఎలా ఉంటాయనే చర్చ కూడ లేకపోలేదు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో కూడ ఇదే రకమైన డిమాండ్‌ వచ్చే అవకాశాలు కూడ లేకపోలేదనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. ఈ తరుణంలో ఏం చేయాలనే విషయమై టిడిపి నాయకత్వం ఆలోచిస్తోంది. కార్పోరేటర్లతో బుదవారం నాడు సమావేశమైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వారి డిమాండ్లను పార్టీ అధిష్టానానికి వివరించనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayawada tdp corporators met MLC Buddha Venkanna on Wednesday at Vijayawada.corporators demanded that remove koneru Sridhar from Mayor post.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి