మారిన టీడీపీ వ్యూహం - పాలిట్ బ్యూరో నిర్ణయం కాదని : అసెంబ్లీ వేదికగా..!!
తెలుగుదేశ్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహం మార్చింది. పాలిట్ బ్యూరో నిర్ణయం కాదని..మరో నిర్ణయం తీసుకుంది. అధికార పక్షం పైన దాడి చేసే అవకాశం కోల్పోకూడదని నిర్ణయించింది. టీడీపీ శాసనసభా పక్షంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం పాలిట్ బ్యూరోలో అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తన సతీమణని అవమానించారనంటూ..సభను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. తాను తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో కాలు పెడతానని శపధం చేసారు.

సభకు దూరంగా చంద్రబాబు
దీంతో.. ఎమ్మెల్యే లు సైతం అధినేతను అనుసరించారు. కానీ, సభను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించలేదు. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని..అటువంటి సభకు వెళ్లి ఉపయోగం లేదని నిర్ణయించారు. దీంతో..సభకు వెళ్లకుండానే ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యారు. అయితే, మరోసారి ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొనేందుకు వారితో చంద్రబాబు సమావేశమయ్యారు.

రాజధాని - వివేకా కేసుల పై చర్చ
అధికార పక్షం ఈ సమావేశాల్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన రాజధాని తీర్పు లో శాసన వ్యవస్థకు ఏపీ రాజధాని మార్పు అధికారం లేదని చెప్పటం పైన చర్చకు సిద్దం అవుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన టీడీపీ సభలో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా వైఎస్ వివేకా హత్య కేసు పైనా చర్చిస్తామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కేసు పైనా చర్చలో పాల్గొనాలనేడి టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

నిర్ణయం మార్చుకొని సభకు
దీంతో..సభను బహిష్కరించాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 11వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ నెల 7వ తేదీన గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీఏసీ సమావేశంలో సమావేశ అజెండాను ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications