జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత, అధికారంలో ఉన్నామనే ?
విజయవాడ/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవప్ మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును ఏమైనా చేస్తారేమో అంటూ ఆ పార్టీ చెందిన సీనియర్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడిని రిమాండ్ కు తరలించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు భారీ బందోబస్తుతో పోలీసులు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు వెళ్లిన తరువాత టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం కావాలనే రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బంద్ కు మిశ్రమ స్పందన వస్తోంది.

ఇదే సమయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలిసిన టీడీపీ నాయకులు జగన్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో భేటీ అయిన తరువాత టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్నెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏ తప్పు చెయ్యలేదని, జగన్ ప్రభుత్వం కుట్రల కారణంగా ఆయన జైలుకు వెళ్లారని ఆరోపించారు.

14 ఏళ్లపాటు నిజాయితీ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును కావాలనే రాజకీయ లబ్దికోసం జైలుకు పంపించారని, ఆయన మీద పెట్టిన కేసులు నిలబడవని, కోర్టులో మాకు న్యాయం జరుగుతోందని అచ్నెన్నాయుడు అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఏమైనా జరిగే అవకాశం ఉందని అచ్నెన్న అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు జైల్లో ఏదైనా జరిగితే అందుకు జగన్ ప్రభుత్వం పూర్తి భాద్యత వహించాలని టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications