వంగవీటి రాధాకు నో టికెట్ - కీలక నిర్ణయం..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కింది. టీడీపీ, జనసేన అభ్యర్దుల జాబితా ప్రకటనతో కొత్త టర్న్ తీసుకుంది. టీడీపీలో పలువురు సీనియర్ల సీట్లు డైలమాలో ఉన్నాయి. టీడీపీ 94 సీట్లకు, జనసేన 5 స్థానాలకు తమ అభ్యర్దులను ప్రకటించింది. బీజేపీతో పొత్తు తేలిన తరువాత మిగిలిన సీట్ల పైన నిర్ణయం తీసుకోనున్నారు. తాజా జాబితాలో వంగవీటి రాధాకు సీటు దక్కలేదు. దీని పైన రాధా అభిమానులు మండి పడుతున్నారు. రాధా ఏం చేయబోతున్నారు.
మారుతున్న లెక్కలు : ఏపీలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. వైసీపీ ఇంఛార్జ్ లను ఖరారు చేసింది. టీడీపీ, జనసేన అభ్యర్దులను ప్రకటించింది. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా జగన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఎలాగైనా జగన్ ను ఓడించాలనేది చంద్రబాబు - పవన్ లక్ష్యం. బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నా..ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన స్థానాల్లో పలువురు సీనియర్ల కు స్థానం దక్కలేదు. మరో 57 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. అయితే, బీజేపీకి కేటాయించగా మిగిలిన స్థానాల్లో సీట్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. అందులో మరికొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. దీంతో..సీట్ల పైన ఆశలు పెట్టుకున్న సీనియర్లలో టెన్షన్ పెరిగుతోంది.

రాధాకు దక్కని సీటు : విజయవాడ నగరంలోని మూడు స్థానాల్లో రెండింట టీడీపీ తమ అభ్యర్దులను ఖరారు చేసింది. తూర్పు నుంచి గద్దే రామ్మోహన్, సెంట్రల్ నుంచి బోండా ఉమా పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమం సీటు కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. ఈ జాబితాలో వంగవీటి రాధాకు సీటు కేటాయించలేదు. ఈ సారి వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, సీటు దక్కే ఛాన్స్ లేదు. వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించకపోవడం పై రంగా , రాధా అభిమానులు ఆగ్రహం చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమం సీటు పెండింగ్ లో ఉన్నా..అక్కడ బీసీ లేదా మైనార్టీకి సీటు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో, అక్కడ రాధాకు ఛాన్స్ లేనట్లే.

అడుగులు ఎటు : 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ సూచించింది. దీనికి అంగీకరించని రాధా టీడీపీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు. ఇక రాధాను జనసేనలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. రాధా నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలోనే వైసీపీ నేతల నుంచి తమ పార్టీలోకి రావాలని మంతనాలు జరిపారు. రాధా టీడీపీలోనే కొనసాగారు. లోకేష్ యువగళం యాత్ర సమయంలోనూ మద్దతుగా నిలిచారు. ఇప్పుడు రాధాకు సీటు లేకపోవటంతో ఆయన రాజకీయంగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. రాధా ఈ పరిణామాల పైన స్పందించలేదు. కానీ, ఆయన అనుచరగణం మాత్రం రాధా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications