• search
  • Live TV
ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయలసీమలో రైతు కోసం తెలుగుదేశం .. కదం తొక్కిన టీడీపీ , పెద్ద ఎత్తున ఆందోళనలు ; డిమాండ్లు ఇవే !!

|
Google Oneindia TeluguNews

రైతు కోసం తెలుగుదేశం అంటూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతు సమస్యలపై పోరాటం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతోంది. రైతు కోసం తెలుగుదేశం నేను సైతం రైతు కోసమంటూ రాయలసీమ రైతు సమస్యలపై కదం తొక్కాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీమ రైతుల డిమాండ్లు నెరవేర్చాలని టిడిపి జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర రైతాంగ సమస్యల పైన వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించడం, ఎలాంటి భరోసా అందని కౌలు రైతుల పరిస్థితి, రాష్ట్రంలో పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం, రైతన్నలు నష్టాల బారిన పడటం, ఇక రైతు భరోసా సగం మందికి మాత్రమే అందుతున్న తీరు, పోలవరం సహా పడకేసిన సాగునీటి ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం సాగిస్తోంది.

రాయల సీమ ప్రాంత రైతాంగ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన టీడీపీ

రాయల సీమ ప్రాంత రైతాంగ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన టీడీపీ

ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతంలో సీమ రైతుల డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరుతున్న టిడిపి పలు డిమాండ్లను చేస్తుంది. హంద్రీనీవా, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. టమాటా, ఉల్లి, బత్తాయి, మిరప పంటకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తోంది. సబ్సిడీ ఇచ్చి బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలని, వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సిడీ పరికరాలు, ట్రాక్టర్లు కొని ఇవ్వాలని, సూక్ష్మ పోషకాల కు 100% రాయితీలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆందోళన

రైతన్నలకు అండగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు పోరు బాట పడుతోంది. ఇక టీడీపీ ఆందోళనలో భాగంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రాప్తాడు టిడిపి నేత పరిటాల శ్రీరామ్ నిరసనకు దిగారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో చేపట్టిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రాప్తాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

టమాటా బాక్సులు మోసిన పరిటాల శ్రీరామ్ .. ప్రభుత్వంపై ఆగ్రహం

ఇందులో భాగంగా టమాటాకు గిట్టుబాటు ధర లేదని టమాటా బాక్సులను మోసిన పరిటాల శ్రీరామ్, ధరల స్థిరీకరణ నిధి ఏమైంది సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ ఒక్క రైతుకు న్యాయం జరగలేదని పరిటాల శ్రీరామ్ విమర్శించారు. రైతాంగానికి డ్రిప్పులు, స్ప్రింక్లర్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని పరిటాల శ్రీరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ఆందోళన .. జగన్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ఆందోళన .. జగన్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం ఆందోళనలు నిర్వహించారు ట్రాక్టర్ పై పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు .ఆలూరు నియోజకవర్గంలోనూ ఎడ్లబండ్లతో ట్రాక్టర్లతో ర్యాలీ చేసి రైతు సమస్యలపై పోరుబాట పట్టారు. పెనుగొండ నియోజకవర్గం లోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అయి ఉండి రాయలసీమ ప్రజల గొంతు కోసేస్తున్నాడు అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి నేత, మాజీ మంత్రి ఎన్ అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ప్రజా ప్రతినిధి అని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి కి అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు.

రాయలసీమ వ్యాప్తంగా అన్ని చోట్లా కొనసాగుతున్న ఆందోళనలు

రాయలసీమ వ్యాప్తంగా అన్ని చోట్లా కొనసాగుతున్న ఆందోళనలు

ఇదే సమయంలో రాయలసీమ రైతుల కష్టాలను వివరిస్తూ ఈ రోజు ప్రొద్దుటూరు, ఎమ్మార్వో గారి కార్యాలయం వద్ద "పంట పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర మరియు రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ హామీ అమలు" అనే డిమాండ్లతో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండల కేంద్రంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని టిడిపి నేతలు నిర్వహించారు. భారీగా ర్యాలీ చేపట్టి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రైతాంగ సమస్యల పరిష్కారానికి నేను సైతం రైతుల కోసం అంటూ టీడీపీ నాయకులు

రైతాంగ సమస్యల పరిష్కారానికి నేను సైతం రైతుల కోసం అంటూ టీడీపీ నాయకులు


డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాయలసీమ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు రైతాంగ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ఏకరువు పెడుతూ, రైతుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి ఏం పరిష్కరించాడో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

Congress rally and Flag hoisting Program | Oneindia Telugu
 ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు

ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు

ఎన్నికల ముందు 85 లక్షల మంది రైతులు అని చెప్పి ఇప్పుడు వై యస్ ఆర్ రైతు భరోసా డబ్బులు ఇవ్వటానికి 40 లక్షల మంది అంటున్నారు. అది కూడా కేంద్రం డబ్బులతో కలిపి అరా కొరగా ఇస్తున్నారని మండిపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే దానికి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు పండుగా పెడతామని హామీ ఇచ్చిన జగన్, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కసారి కూడా పంటనష్టాన్ని సరిగా ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. ప్రతి రైతుకు బోర్డు ఉచితంగా వేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పటివరకు ఎన్ని బోర్లు వేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు పాదయాత్రలో ఎన్నో మాయమాటలు చెప్పారని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతన్నను మోసం చేస్తూనే ఉన్నారని సోషల్ మీడియా వేదికగానూ తెలుగు తమ్ముళ్ళు ధ్వజమెత్తుతున్నారు.

English summary
The Telugu Desam Party, in support of the farmers, has been fighting for five days from today. Concerns continue across Rayalaseema that the TDP fighting for msp to farmers as part of its agitation. Raptadu TDP leader Paritala Sriram, former minister Bhuma Akhil Priya in Allagadda and former minister Amarnath Reddy in Chittoor are raising flags against Jagan govt. Massive rallies and protests erupted. The Telugudesam program for farmers will continue on a large scale with the call made by Chandrababu Naidu to bring pressure on the government to solve the problems of the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X