ఏపీ స్ధానిక సంస్ధల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంకోర్టులో టీడీపీ పిటిషన్
ఏపీ స్ధానిక సంస్ధల్ల బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష టీడీపీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 50 శాతం కోటా దాట రాదన్న సాకుతో బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టడం చెల్లదని టీడీపీ పిటిషన్ లో పేర్కొంది
బీసీ రిజర్వేషన్లలో కోతపై సుప్రీంలో టీడీపీ పిటిషన్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 9.85 శాతం మేర తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ పిటిషన్ వేశారు. ఏపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం చెల్లదని టీడీపీ నేతలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై టీడీపీ ఆగ్రహం
Recommended Video

ఏపీ స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ వైసీపీ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మొత్తం రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 59.85 శాతానికి పెంచిన వైసీపీ సర్కారు.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కోటా తగ్గింపులో ప్రధానంగా బీసీలే నష్టపోవాల్సిన పరిస్ధితి. రాజ్యాంగపరంగా ఎస్సీ, ఎస్టీ కోటాను తగ్గించే అవకాశం లేకపోవడంతో అనివార్యంగా 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 9.85 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం నిన్న జీవో ఇచ్చింది.
అయితే బీసీల అండతో ఇన్నాళ్లూ రాజకీయాలు చేసి గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వారి మద్దతు కోల్పోయిన టీడీపీ మరోసారి వారిని అకట్టుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరుకు సిద్ధమైంది. ఇవాళ టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలో సుప్రీం విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications