భరతమాత గుండెలపై గునపం, తాలిబన్లను మించిన వైకాపాబన్లు : విగ్రహం తొలగింపు రచ్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం వద్ద భరతమాత విగ్రహం తొలగింపు ప్రస్తుతం దుమారంగా మారింది. తాడేపల్లిలో ఉన్న భరతమాత విగ్రహాన్ని అర్ధరాత్రి క్రేన్ సహాయంతో మున్సిపల్ అధికారులు తొలగించి వేరేచోటికి తరలించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి భద్రత, రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతో అధికారులు రోడ్డుపై ఉన్న భరతమాత విగ్రహాన్ని తొలగించారు.
భరత మాత విగ్రహాన్ని తొలగించిన మున్సిపల్ అధికారులు
అర్ధరాత్రి సమయంలో భరతమాత విగ్రహం తొలగించడంపై స్థానికుల నుండి నిరసన వ్యక్తమవుతోంది. తాడేపల్లికి ప్రధాన ఆకర్షణ గా ఉన్న, తాడేపల్లి వాసుల దేశభక్తికి నిదర్శనమైన భరత మాత విగ్రహం ఎలా తొలగిస్తారు అంటూ స్థానికులు పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఇంటి భద్రత కోసం, అడ్డుగా ఉందని భరతమాత విగ్రహాన్ని సైతం తొలగిస్తారా అంటూ ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే భరతమాత విగ్రహాన్ని తొలగించడంపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతోంది.

జగన్ సర్కార్ పై టీడీపీ ధ్వజం .. పౌరుల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ..
సోషల్ మీడియా వేదికగా భారతమాతకు అవమానం జరిగిందంటూ జగన్ సర్కార్ పై మండిపడుతుంది. జగన్ రెడ్డి కోసం భరతమాతను అవమానించి పౌరుల మనోభావాలను దెబ్బతీసింది వైసీపీ ప్రభుత్వం అంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధరాత్రి కూల్చివేతలకు పేరుపడిన ప్రభుత్వం అంటూ మండిపడింది. అంతేకాదు ఈ విధ్వంసకర ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ భరత మాత విగ్రహాన్ని తొలగించి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ వెల్లడించింది.

ధ్వజమెత్తిన లోకేష్ .. తాలిబన్లను మించి వైకాపాబన్లు అంటూ
భరతమాత విగ్రహం తొలగింపు ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లను మించిపోయారు అంటూ వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. తన తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదని నిరుపేదలకు ఇల్లు కూలగొట్టించాడు జగన్ రెడ్డి .ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారు అంటూ లోకేష్ సోషల్ మీడియా వేదికగా భరతమాత విగ్రహాన్ని తొలగించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూర్ఖపు పనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తనకు రెండు కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనం అంటూ లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొక్లైనర్ లతో పెకలించిన భరతమాత విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని, చేసిన మూర్ఖపు పనికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. భరతమాత విగ్రహాన్ని తొలగించటం అన్యాయమని నారా లోకేష్ పేర్కొన్నారు.

రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న కారణంతో విగ్రహం తొలగింపు
ముఖ్యమంత్రి ఇంటికి వెనక వైపు ఉన్న డెల్టా కాల్వకట్ట విస్తరించి రోడ్డు వేసే చర్యల్లో భాగంగా విద్య నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహాన్ని తొలగించారు. తాడేపల్లి కి తాగునీటిని అందించే పథకం వద్ద గతంలో భరతమాత చిన్న విగ్రహం ఉండేది. దాని స్థానంలో గత ప్రభుత్వం 2018 డిసెంబర్ లో 15 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు .దాని చుట్టూ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ నివాసం వద్ద నాలుగో చెక్ పోస్ట్ వద్ద వున్న ఈ విగ్రహం రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్నందున తొలగించినట్టు తాడేపల్లి మంగళగిరి నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు.

పనులు కాగానే తిరిగి ఏర్పాటు చేస్తామన్న అధికారులు
ప్రస్తుతం ఈ విగ్రహాన్ని తాడేపల్లిలోని నగరపాలక జోన్ కార్యాలయం వద్దకు తరలించారు. విగ్రహాన్ని రోడ్డు విస్తరణ పూర్తయ్యాక తిరిగి ఏర్పాటు చేస్తామని వారు వెల్లడించారు. ఈ విషయంలో కూడా రాద్దాంతం చెయ్యటం మంచిది కాదని వారంటున్నారు. అయితే సీఎం జగన్ ఇంటికి రోడ్డు వేయడానికి భరతమాత విగ్రహాన్ని తొలగించడం తప్పని టిడిపి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications