భయపడ్డ జగన్ రెడ్డి; టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభలో హైడ్రామా అందుకే: భగ్గుమన్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న మరణాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో వరుసగా నాలుగో రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై టిడిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజూ భయపడ్డ జగన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ప్రాణాంతకమైన జె బ్రాండ్స్, నాటు సారా మాఫియాపై అసెంబ్లీలో పోరాడుతున్న టిడిపి ఎమ్మెల్యేలని వరుసగా నాలుగో రోజు కూడా సస్పెండ్ చేసిన స్పీకర్ అంటూ టిడిపి ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.

అసెంబ్లీలో హైడ్రామా నడుపుతున్నారు : నిమ్మకాయల చినరాజప్ప

అసెంబ్లీలో హైడ్రామా నడుపుతున్నారు : నిమ్మకాయల చినరాజప్ప

వరుసగా నాలుగో రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ లో సస్పెండ్ చేసి హైడ్రామా నడుపుతున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద కుంభకోణం కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలని నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంతో పాటుగా మార్షల్స్ తో బలవంతంగా బయటకు పంపించి సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.

కల్తీ నాటు సారా బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం: ఆదిరెడ్డి భవాని

కల్తీ నాటు సారా బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం: ఆదిరెడ్డి భవాని

వాస్తవ విరుద్ధ ప్రకటనలతో సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. కల్తీ నాటుసారా బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. 10 మంది తెలుగుదేశం శాసనసభ్యులను అసెంబ్లీలో అడ్డుకోవడం కోసం 50 మంది మార్షల్స్ ను రంగంలోకి దించారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్థంకాని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్కొన్నారు.

నాటు సారా తయారీ వెనుక అధికార వైసీపీ : బెందాళం అశోక్

నాటు సారా తయారీ వెనుక అధికార వైసీపీ : బెందాళం అశోక్

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలుగుదేశం పార్టీ గొంతు నొక్కాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో గంజాయి పంట తరహాలోనే నాటుసారా తయారీ కూడా జరుగుతుందని, దీని వెనక అధికార వైసీపీ ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు. కల్తీ నాటుసారా మరణాలను తగ్గించి చూపే ప్రయత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బెందాళం అశోక్ మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నాటు సారా మాఫియా: మంతెన రామరాజు

రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నాటు సారా మాఫియా: మంతెన రామరాజు

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సైతం సీఎం జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కల్తీ నాటుసారా స్లో పాయిజన్ లాగా ప్రజల ప్రాణాలను హరిస్తున్నా జగన్ సర్కార్ వద్ద సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ నాటు సారా మాఫియా ఉందని, అమ్మకాలు జరుగుతున్నాయంటూ ఆరోపించిన ఆయన నాటుసారా బెల్టుషాపులు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నట్టు కళ్లకు కనిపిస్తుంటే సీఎం ఎలా అసెంబ్లీ వేదికగా అసత్యాలు చెబుతారని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+