వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన సమయంలో సమైఖ్య గళం బలంగా వినిపించిన ఎప్ శివప్రసాద్..! ఇక లేరు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Former MP N.Sivaprasad Passed Away || చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు టీడిపి మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ మృతితో తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోడెల శివప్రసాద్ అకాల మరణంతో తీవ్ర శోక సంద్రంలో ఉన్న టీడిపి శ్రేణులను ఎన్ శివప్రసాద్ మృతి మరింత దుఃఖసాగరంలోకి నెట్టింది. పార్టీలో ఉత్సాహంగా ఉండే శివప్రసాద్ ఇక లేరనే వార్తను నాయకులతో పాటు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. నేతలతో పాటు పార్టీ శ్రేణులతో సరదాగా ఉంటూ హాస్యాన్ని పండించే చిత్తూరు మాజీ ఎంపి మరణం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా శివప్రసాద్ పార్టీకి చేసిన సేవలను కొనియాడుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా శివప్రసాద్ వ్యవహరించిన తీరును ఏపి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

కొంతకాలంగా అస్వస్థత: చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ మృతికొంతకాలంగా అస్వస్థత: చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ మృతి

 పార్లమెంట్ విచిత్ర విన్యాసాలు..! మోడీనే నవ్వించిన శివప్రసాద్ ఇక లేరు..!!

పార్లమెంట్ విచిత్ర విన్యాసాలు..! మోడీనే నవ్వించిన శివప్రసాద్ ఇక లేరు..!!

పార్లమెంట్ లో శివప్రసాద్ చేసే విన్యాసాలకు సాక్షాత్తూ ప్రధాన మంత్రే నవ్వుకున్న సందర్బాలు ఉన్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రధాని మోదీ ఓ సందర్బంలో ప్రస్తావించారు కూడా. తాను ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలా అనే అనేక ఒత్తిళ్లతో సభకు వస్తుంటానని, ఈ క్రమంలో ఎంపి శివప్రసాద్ వేషాలు, హావభావాలు చూసి నవ్వుకుంటానని స్వయంగా ప్రధాని మోదీ గుర్తు చేసారు. ఇక విభజన సమయంలో కూడా పార్లమెంట్ ఆవరణలో సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు వ్యతిరేకంగా ఎన్నో స్కిట్ లు చేసారు శివప్రసాద్.

 విభజనకు వ్యతిరేకంగా ఎన్నో విన్యాసాలు..! ప్రత్యేక స్కిట్ లు చేసిన టీడిపి ఎంపీ..!!

విభజనకు వ్యతిరేకంగా ఎన్నో విన్యాసాలు..! ప్రత్యేక స్కిట్ లు చేసిన టీడిపి ఎంపీ..!!

విభజన వల్ల కలిగే నష్టాలను, అన్నదమ్ములను విడదీస్తే వచ్చే కష్టాలను, ఉమ్మడి కుంటుంబం విడిపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అనే అంశాలను విభజనతో పోలుస్తూ పార్లమెట్ ఆవరణలో శివప్రసాద్ విచిత్ర వేషధారణలో వివరిస్తూండే వారు. ముఖ్యంగా సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆయన అనేక పాటలు పాడారు, ఎన్నో వేషాలు వేసారు. ఇదే అంశంలో కాంగ్రెస్ ఎంపీలతో కాస్త ఘర్షణ పూరిత వాతావరణానికి కూడా శ్రీకారం చుట్టారు శివప్రసాద్. 2009 నుండి 2014 వరకు పార్లమెంట్ లో విభజనకు వ్యతిరేకంగా అనేక పాత్రలను పోషించారు. పార్లమెంట్ ఆవరణలో అడాల్ప్ హిట్లర్ గా, తాంత్రికుడుగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గా అనేక వేషాలతో సాటి ఎంపీలను అలరించారు శివప్రసాద్.

 ప్రత్యేక హోదా కోసం మోదీ పైన సెటైర్లు..! నవ్వుకున్న బీజేపి శ్రేణులు..!!

ప్రత్యేక హోదా కోసం మోదీ పైన సెటైర్లు..! నవ్వుకున్న బీజేపి శ్రేణులు..!!

ఐతే శివ ప్రసాద్ తన విన్యాసాలతో రాష్ట్ర విభజనను ఆపలేకపోయారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపికి ప్రత్యేక హోదా, నిధుల అంశంలో కూడా అనేక విచిత్ర వేషాలు వేసారు శివప్రసాద్. 2014 నుండి గత సార్వత్రిక ఎన్నికల వరకు చిత్తూరు ఎంపీగా కొనసాగిన శివప్రసాద్ పార్లమెంట్ ఆవరణలో తను చేసే విన్యాసాల ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో నిరసనలు ఇలా కూడా చేయొచ్చా అనే సందేహం కలిగేలా వ్యవహరించేవారు శివప్రసాద్. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో తాను చేసిన విన్యాసాలతో దేశ వ్యాప్తంగా నవ్వులు పూయించారు శివప్రసాద్.

 కాంగ్రెస్ పై ఎన్నో నిరసనలు..! పార్లమెంట్ లో ప్రత్యేకర గుర్తింపు తెచ్చుకున్న శివప్రసాద్..!!

కాంగ్రెస్ పై ఎన్నో నిరసనలు..! పార్లమెంట్ లో ప్రత్యేకర గుర్తింపు తెచ్చుకున్న శివప్రసాద్..!!

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన, అప్పటి ప్రదాని మన్ మోహన్ సింగ్ పైన ఎన్నో సెటైరికల్ స్కిట్ లు చేసారు శివప్రసాద్. రాష్ట్ర విభజన తో నీటి సమస్యలు, నియామకాలు, విద్యుత్, రాష్ట్ర ఆదాయ వనరులు, మిగులు బడ్జెట్ పంపకాలు తదితర అంశాలను తన విన్యాసాలతో చైతన్య పరిచేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భవిశ్యవాణి వివరిస్తూ శాపనార్ధాలు కూడా పెట్టారు శివప్రసాద్. సమస్యలకు వ్యతిరేకంగా ఎన్ని విన్యాసాలు. స్కిట్ లు చేసినా జనాలు గాని, పార్టీ నేతలు గాని వినోదాన్ని పంచే కోణంలో చూసారే తప్ప ఏనాడూ శివప్రసాద్ మనో వేదనకు ప్రాముఖ్యత ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా, ఏపి కి నిధుల అంశంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన విన్యాసాలను కూడా బీజేపి కేంద్ర మంత్రులు అలాగే బావించారు. తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో టీడిపి ఘోర పరాజయం పాలవ్వడం, శివప్రాసద్ కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన మరణంతో పార్లమెంట్ ఆవరణలో విచిత్ర వేషాలు వేసే నాయకుడు ఎవరనే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

English summary
Chittoor TDP's former MP N.Sivaprasad's death has been a tragic shadow in the Telugu Desam party. N Shivaprasad's death has been pushed into further grief, with the untimely demise of the Bulls Shivprasad. The party is not able to digest the news of the enthusiastic Shiva Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X