సంస్కరణలు చేపడుతున్నాం
సంస్కరణలు చేపడుతున్నాం
శ్రీకాకుళం: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధి క్రీడల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మరో ఆరు నెలల్లో క్రీడలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీకాకుళంలోని కోడిరామ్ముర్తి స్టేడియం నిర్వహించిన ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీలను ఆయన ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి,బగ్గు రమణమూర్తిలతో కలిసి ప్రారంభించారు.అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో క్రీడాకారుల కోసం క్రీడా వికాస కేంద్రంల పేరుతో మినిస్టేడియంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications