Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఒక్కటీ మినహా, వర్మ- రాధాకు పదవులపై తాజా ఆఫర్..!!

ఏపీలో కొత్త రాజకీయ లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమిలో పదవుల విషయంలో మూడు పార్టీల కేడర్ లో పోటీ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా ఇంకా పూర్తి స్థాయిలో పదవులు భర్తీ చేయలేదు. ఎన్నికల సమయంలో టీడీపీలో సీట్లు త్యాగం చేసిన సీనియర్లు.. ముఖ్య నేతలు పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ పొందిన నేతలు ఎక్కువగా ఉన్నారు. దీంతో.. కొందరు నేతలతో పదవుల విషయం లో పార్టీ నాయకత్వం స్పష్టత ఇస్తోంది.

కొత్త ఆలోచన
ఏపీలో పలు విడతలుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసారు. కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల నుంచి అవకాశం దక్కింది. అయితే, పిఠాపురం వర్మ .. వంగవీటి రాధ కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత భర్తీ చేసిన ఎమ్మెల్సీల సమయం లోనూ వర్మకు ఛాన్స్ దక్కలేదు. దీంతో, తాజాగా వర్మ తో పాటుగా వంగవీటి రాధాకు కు ఇచ్చే పదవి పైన టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న వర్మకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని.. వర్మ భవిష్యత్ తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు. పవన్ కు భారీ మెజార్టీ రావటం లో వర్మ క్రియాశీలకంగా పని చేసారు. పవన్ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు.

tdp-high-command-planning-for-appoint-varma-and-vangaveeti-radha-in-key-posts

దక్కని పదవి
కాగా, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోవటం పైన ఆయన మద్దతు దారుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. పిఠాపురంలో వర్మకు తగిన గౌరవం జనసేన కేడర్ నుంచి దక్కటం లేదనే అభిప్రాయం ఉంది. అదే విధంగా వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు అమలు కాలేదు. తాజా ఎన్నికల్లోనూ రాధా కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజాగా వర్మ తో పాటుగా రాధాకు త్వరలోనే రాష్ట్ర స్థాయి లో కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరికీ ఎమ్మెల్సీ పదవుల పైన గతంలో హామీ ఇచ్చినా.. ఇదే రకమైన హామీ ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువ గా ఉంది. అదే సమయంలో వారి సొంత నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి.

కీలక బాధ్యతలు
దీంతో, ఆ ఇద్దరికీ ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటం ఆలస్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందనే వాదన జనసేనలో ఉంది. ఎమ్మెల్సీ సీటు కోసం ఇదే విధంగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన పలువురు టీడీపీ సీనియర్లు ఆశిస్తున్నారు. దీంతో.. ఈ ఇద్దరికీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న పదవులను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మలి విడతలో మండలిలో ఏర్పడే ఖాళీల్లో వీరికి అవకాశం కల్పిస్తామని చెబుతున్నట్లు సమాచారం. దీంతో.. ఎమ్మెల్సీ కాకుండా, ఈ ఇద్దరి ఏ పదవులు ఇస్తారు.. అందుకు ఈ ఇద్దరూ సిద్దంగా ఉన్నారా అనేది కీలకంగా మారుతోంది. ఈ నెలాఖరులో పదవుల భర్తీ చేస్తామని చెబుతున్న వేళ.. ఈ ఇద్దరి పైన తీసుకునే నిర్ణయం పైన పార్టీలో ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+