కీలక జిల్లాలో అభ్యర్దుల ఎంపికలో చంద్రబాబు అనూహ్య నిర్ణయాలు..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరో పది రోజుల్లో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటు పొత్తుల లెక్కల పైనా క్లారిటీ రానుంది. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా సమావేశం..ప్రధానితో సీఎం జగన్ భేటీ రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన సీట్ల పంపకాల పైన ఒక అంచనాకు వచ్చారు. కీలకమైన గుంటూరు జిల్లాలో అభ్యర్దులను దాదాపు ఖరారు చేసారు.
సీనియర్లకు ప్రాధాన్యత : అమరావతి రాజధాని ప్రభావం ఈ సారి గుంటూరు, క్రిష్ణా జిల్లాలో తమకు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. 2019 ఎన్నికల్లొ గుంటూరు జిల్లాలో టీడీపీ కేవలం రెండు స్థానాలు గెలిచింది. పార్టీకి పట్టున్న ఈ జిల్లాలో తిరిగి పట్టు సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో సీనియర్లకు తిరిగి స్థానాలు ఖరారు చేస్తున్నారు. తెనాలి స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు. జనసేన మరో సీటు కోరుతున్నట్లు తెలిసింది. అభ్యర్థులు ఖరారైన 12 సీట్లలో ఎనిమిది చోట్ల గత ఎన్నికల అభ్యర్థులే మళ్లీ పోటీ చేయనున్నారు. తెనాలితో పాటుగా గుంటూరు పశ్చిమం సీటు జనసేన ఆశిస్తోంది. అయితే, రెండు సీట్లు ఒకే పార్లమెంట్ పరిధిలో ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తెనాలి నుంచి టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.

సీట్లు - అభ్యర్దులు : మంగళగిరిలో నారా లోకేశ్, వేమూరులో నక్కా ఆనందబాబు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్, రేపల్లె-అనగాని సత్యప్రసాద్, చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ-జీవీ ఆంజనేయులు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు తిరిగి పోటీ చేయనున్నారు. వీరిలో అనగాని సిటింగ్ ఎమ్మెల్యే. కొత్తగా సత్తెనపల్లెలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్లలో నరేంద్ర వర్మ పోటీ చేయనున్నారు. గుంటూరు పశ్చిమం నుంచి టీడీపీ తరఫున చాలా మంది పోటీపడుతున్నారు. ఇదే సీటును జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస యాదవ్ కోరుతున్నారు. గుంటూరు తూర్పు సీటు పైనా పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జనసేనకు సీట్లు ఖరారు : పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తోపాటు కొత్తగా వచ్చిన నేత భాష్యం ప్రవీణ్ సీటును ఆశిస్తున్నారు. మాజీ మంత్రి రాజా కు తెనాలికి ప్రత్యామ్నాయంగా పెదకూరపాడు సీటు ఆశిస్తున్నారు. నరసరావుపేటలో ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబుతోపాటు కడియాల లలిత్, కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలోని మూడు ఎంపీ సీట్లలో రెంటిపై టీడీపీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నరసరావుపేట సీటుకు సిటింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఖరారయ్యారు. గుంటూరు ఎంపీ సీటుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌వైపు నాయకత్వం మొగ్గు కనిపిస్తోంది. బాపట్ల ఎంపీ సీటుపై నిర్ణయం జరగలేదు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications