Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రశాంత్ కిషోర్ ఏం సలహాలిస్తున్నారో తెలియదు కానీ: జగన్‌పై జేసీ

వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, ధ్యాస అంతా ముఖ్యమంత్రి కూర్చీ పైనే అని టిడిపి ఎంపి జేసీ దివాకర్ రెడ్డి సోమవార మండిపడ్డారు.

అనంతపురం: వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, ధ్యాస అంతా ముఖ్యమంత్రి కూర్చీ పైనే అని టిడిపి ఎంపి జేసీ దివాకర్ రెడ్డి సోమవార మండిపడ్డారు.

జగన్ హామీలు చూస్తుంటే రాష్ట్ర బడ్జెట్‌కు కూడా సరిపోదన్నారు. తాను సీఎం అయ్యాక చేసే 9 పనులపై జగన్ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ జగన్ చెప్పిన దానిని బట్టి చూస్తే గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తారని తెలుస్తోందన్నారు.

TDP JC Diwakar Reddy fires at YS Jagan

రైల్వే జోన్ విషయంలో ఈసారి గట్టిగా పోరాడుతామని చెప్పారు. రైల్వే జోన్ కోసం ఈసారి ఒత్తిడి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పెంపు బిల్లు ప్రవేశ పెడతారని సీఎం చంద్రబాబు ఆశాజనకంగా ఉన్నారని చెప్పారు.

పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో తాము నియోజ‌క వ‌ర్గాల పెంపుపై చ‌ర్చించామ‌న్నారు. నియోజ‌క వ‌ర్గాల పెంపుపై ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే స్పష్ట‌త వ‌స్తుంద‌న్నారు. కాగా, చంద్రబాబు అధ్యక్షతన అంతకుముందు టిడిపి పార్లమెంటరీ బేటీ జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+