చంద్రబాబుపై జగన్ రివేంజ్ టైం - 2019 రిపీట్, ఇదీ లెక్క..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో శాసనసభ సమావేశం కానుంది. తాజా ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ, ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల అమల్లో జగన్ నిర్ణయం కీలకం కానుంది. జగన్ సీఎంగా గెలిచిన తొలి రోజుల్లో చోటు చేసుకున్న పరిణమాలకు ఇప్పుడు అదే తరహాలో రివేంజ్ తీర్చుకొనే అవకాశం దక్కింది. మరి.. జగన్ ఏం చేయబోతున్నారు. చంద్రబాబు వ్యూహాలేంటి.

మండలిలో వైసీపీ బలం
ఏపీ శాసససభలో టీడీపీ, జనేసేన, బీజేపీ కూటమికి 164 సభ్యుల బలం ఉంది. వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సమయంలో అయిదు సంతకాలు చేసారు. అందులో లాండ్ టైటిల్ యాక్ట్ సహా..రానున్న రోజుల్లో కీలక బిల్లులు అసెంబ్లీ - మండలిలో ఆమోదం పొందితేనే ఆమల్లోకి వస్తాయి. ఇక్కడే కూటమికి చిక్కు ఏర్పడుతోంది. అసెంబ్లీలో పూర్తి బలం ఉన్న కూటమికి మండలిలో సంఖ్యా బలం తక్కువ. ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని బిల్లులకు మండలిలో వైసీపీ అడ్డుపడే ఛాన్స్ ఉంది.

TDPs Lack of council numbers may block Govt key bill see deets

నాడు టీడీపీ తరహాలో
మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ సైతం వైసీపీ హాయంలోనే ఎంపిక అయిన వారు కొనసాగుతున్నారు. శాసనమండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఎక్కువమంది సభ్యులున్నారు. మొత్తంగా శాసన మండలిలో మొత్తం 58 సీట్లకు గాను వైసిపికి 38 మంది(8 మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి) ఎమ్మెల్సీలున్నారు. TDP నుంచి 8 మంది, నలుగురు ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ నుంచి ఇద్దరు సభ్యులున్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ డిసైడ్ అయిపోయారు. దీంతో..శాసనమండలిలో బలంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సైతం దిశానిర్దేశం చేశారు.

టీడీపీ ఏం చేయనుంది
వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజార్టీ ఉన్న టిడిపి అడ్డుకుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును వైసిపి అడ్డుకొనే అవకాశం ఉంది. అక్కడే ప్రతీ బిల్లు పైన వైసీపీ సభ్యులు మాట్లాడి..ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. టీడీపీకి ప్రస్తుతం అసెంబ్లీలో పూర్తి సంఖ్యా బలం ఉండటంతో క్రమేణా మండలిలో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, వైసీపీ ఎమ్మెల్సీలు అదే పార్టీలో ఉంటారా..అధికార పార్టీకి దగ్గరవుతారా అనేది కీలకంగా మారనుంది. దీంతో..ప్రభుత్వ బిల్లుల విషయంలో మండలి లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+