ఎంపీ గోరంట్ల మాధవ్ కు కేంద్ర మంత్రి పదవి??

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో వైర‌ల్ అవుతున్న వేళ విప‌క్ష‌నేత‌లు ఎంపీపై, ఆ పార్టీపై తీవ్ర‌స్థాయి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వైసీపీకి కొత్త అర్థం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాద‌ని, ''యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీ''గా'' అభివ‌ర్ణించారు. పార్టీ పేరును ఎంపీ గోరంట్ల ఇలా సార్థ‌కం చేశార‌న్నారు. అవంతి అర‌గంట స‌ర‌సం, అంబ‌టి గంట విహారం లాంటి వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తే ఎటువంటి చ‌ర్య‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకోలేద‌న్నారు. ఇలా చేస్తేనే గుర్తిస్తున్నారన్న ఉద్దేశంతో ఎంపీ ఇటువంటి వీడియోను బయటకు వ‌దిలాడ‌ని ఎద్దేవా చేశారు.

tdp leadeers comments on ycp mp gorantla madhav nude video

గోరంట్ల మాధ‌వ్ లీల‌లు మెచ్చి ముఖ్య‌మంత్రి ఆయ‌న‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన పనిలేద‌ని, మ‌హిళ‌ల‌పై దాడిచేస్తే జ‌గ‌న్ ప్ర‌మోష‌న్ ఇస్తున్నార‌ని, దీనివ‌ల్లే రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు పెరుగుతున్నాయని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ టీటెక్ ర‌వి మండిపడ్డారు. దేశ‌మంతా ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో వేడుక‌లు జ‌రుగుతుంటే రాష్ట్రంలో అశ్లీల నృత్యాలు, చూడాల్సి వ‌స్తోందంటూ మాజీ మంత్రిసోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కియా కంపెనీ ప్ర‌తినిధుల‌తో అస‌హ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ప్పుడే ఇటువంటివారిని ఇంటికి పంపించి ఉండాల్సింద‌ని, వైసీపీ నేత‌ల ప్ర‌వ‌ర్త‌న‌, వాడుతున్న భాష‌ను చూసి ప్ర‌జ‌లు సిగ్గుతో త‌లదించుకుంటున్నార‌న్నారు. ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నవారిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అసభ్యకరమైన వీడియోత అడ్డంగా దొరికిపోయిన మాధవ్ చేత మహిళలకు క్షమాపణలు చెప్పించి పార్టీ నుంచి బహిష్కరించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+