తునిలో టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిన వేళ.. యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ కోసమే నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు.

కాకినాడ: కాకినాడ జిల్లాలోని తుని అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఖరారు చేసిన వేళ.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. నాడు నేడు పథకంపై ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందంటూ ఆరోపించారు.

విద్యా వ్యవస్థ నిర్వీర్యం కోసం..

విద్యా వ్యవస్థ నిర్వీర్యం కోసం..

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే జగన్ ప్రభుత్వం నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టారని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మహిళ విద్యా విషయంలో ఏపీ దేశంలో పదో స్థానంలో నిలిచిందని, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోయాయంటూ అసర్ నివేదికను ఆయన ఉటంకించారు. ప్రభుత్వం అసమర్ధత వల్ల డ్రాప్వౌట్స్ పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. 10వ తరగతిలో 64.02 శాతమే రిజల్ట్స్ వచ్చాయని గుర్తు చేశారు.

రాజకీయ సభలకు స్కూల్ బస్సులు..

రాజకీయ సభలకు స్కూల్ బస్సులు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన రాజకీయ సభలు, కార్యక్రమాల కోసం స్కూల్ బస్సులను వాడుకుంటోన్నారని ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు దౌర్జన్యంగా మూయించేస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలా ఉంచిన ప్రభుత్వం దేశంలో ఏపీ ఒక్కటేనని ధ్వజమెత్తారాయన.

డీఎస్సీ ఏదీ..?

డీఎస్సీ ఏదీ..?

ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాడని, ఇప్పుడు సుమారు 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ.. భర్తీ చేయట్లేదని ఆరోపించారు. 3,4,5 తరగతుల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం వల్ల మూడున్నర లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్స్ అయ్యారని యనమల ఆరోపించారు. 44 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి అందుతోందని విమర్శించారు.

టీడీపీలో హయాంలో..

టీడీపీలో హయాంలో..

తమ ప్రభుత్వ హయాంలో 4,528 మంది విద్యార్థులను విదేశీ విద్య కింద ఆర్థిక సహాయం చేశామని యనమల రామకృష్ణుడు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పథకం కింద విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించిందని మండిపడ్డారు. అలవి కాని నిబంధనలు పెట్టారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులను మోసం చేశారని యనమల చెప్పారు.

ఎయిడెడ్.. డెడ్

ఎయిడెడ్.. డెడ్

జగన్ ప్రభుత్వంలో ఎయిడెడ్ విద్యాసంస్థల వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని యనమల విమర్శించారు. మన బడి నాడు నేడు పథకం పేరుతో 16,000 కోట్ల రూపాయల దోపిడీకి వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని అన్నారు.

విద్యా కానుక పేరుతో నాసిరకం బ్యాగ్, బూట్లు విద్యార్థులకు సరఫరా చేస్తోన్నారని, ఇప్పటికీ 40 శాతం మేర పుస్తకాల పంపిణీ జరగలేదని అన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు నోటీసులు పంపిస్తున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+