Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలతో అమరావతి (Amaravati)ని పోలుస్తూ.. హడావిడి పడకుండా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగుల భవనాలు నిర్మించి వదిలేయాలంటూ విజయసాయిరెడ్డి (vijayasai reddy) చంద్రబాబుకు ఇచ్చిన సలహాపై టీడీపీ స్పందించింది. హైదరాబాద్ ఉదాహరణను చూపుతూ విజయసాయిరెడ్డి వాదనకు కౌంటర్ గా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (Budda venkanna) ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు.

అయ్యా విజయసాయి రెడ్డి గారూ.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందినవి అనేది నిజమే అంటూ అంగీకరించిన బుద్దా వెంకన్న...కానీ అవి పెద్ద నగరాలుగా మారడానికి ఒక దశలో ప్రభుత్వాలు దూరదృష్టితో పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టిన విషయం కూడా గుర్తించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ది ఒక ముఖ్యమైన ఉదాహరణ అన్నారు. 400 సంవత్సరాలుగా కేవలం చారిత్రక నగరంగా ఉన్న హైద్రాబాద్ 26 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు.

Tdp leader Budda Venkanna Fires On Vijayasai Reddy Over Amaravati Capital Argument

ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అది ఐటీ రంగాన్ని ఆకర్షించడానికి చేసిన వ్యూహాత్మక నిర్ణయం అన్నారు. అదే 400 సంవత్సరాలుగా అక్కడ రూ.1 లక్ష లేని ఎకరం భూమి ధర నేడు 100కోట్లు పైగా పలుకుతుందన్నారు. ఆ సమయంలో అది కూడా "అవసరం లేని ఖర్చు" అని విమర్శలు వచ్చాయన్నారు. కానీ ఈరోజు అదే హైటెక్ సిటీ హైదరాబాదు ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా మార్చిందన్నారు. లక్షలాది ఉద్యోగాలు, ఎంతోమందికి ఉపాధి, అంతర్జాతీయ పెట్టుబడులు, భారీ ఆర్థిక వృద్ధికి అది పునాది అయిందన్నారు. దూరదృష్టి ఉన్న నాయకత్వం ముందుగానే పెట్టుబడులు పెట్టకపోతే, ఇంత అభివృద్ధి జరగదని గుర్తుచేశారు. అమరావతి విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్నారు.

ముందుగా కేవలం అసెంబ్లీ, సచివాలయం నిర్మించి ఆగిపోతే, అది ఒక పరిమిత ప్రభుత్వ నగరంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. పెద్ద స్థాయిలో మౌలిక వసతులు, ఆధునిక డిజైన్లు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి- ఇవన్నీ కలిసి పెట్టుబడులను, పరిశ్రమలను, ఉద్యోగాలను ఆకర్షిస్తాయని,ఇలా మన అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా మారాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే మిమ్మల్ని, మీ జగన్ ను పక్కనపెట్టి చంద్రబాబును ఎన్నుకున్నారన్నారు. ఆది గుర్తించాలన్నారు. అలాగే రాజధానికి అప్పులు తీసుకోవడం తప్పు కాదని, అవి సరిగ్గా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆర్థిక లాభాలు తెస్తాయన్నారు.

Tdp leader Budda Venkanna Fires On Vijayasai Reddy Over Amaravati Capital Argument

ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాలు కూడా మొదట్లో భారీ పెట్టుబడులతోనే నిర్మించబడ్డాయని,రాజధాని నగరం అనేది కేవలం కార్యాలయాల సముదాయం కాదన్నారు. అది ఒక రాష్ట్ర ప్రతిష్ఠ, ఆర్థిక శక్తి, భవిష్యత్తు అవకాశాల కేంద్రం అన్నారు. అందుకే అమరావతిని చిన్నగా ఆలోచించడం కాదు పెద్దగా, దీర్ఘకాల దృష్టితో నిర్మించాలన్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే, భవిష్యత్తులో గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఇకనైనా అమరావతిపై అనవసరమైన దుష్ప్రచారాలు ఆపి ప్రజలతో కలిసి అభివృద్ధికి సహరించాలన్నారు. భవిష్యత్తులో మీరు కూడా మా రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధాని ఉంది అని గర్వంగా చెప్పుకోవచ్చని సాయిరెడ్డికి బుద్దా వెంకన్న సలహా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+