చంద్రబాబుకు రక్తాభిషేకం: ఒక్క టికెట్.. ప్లీజ్

Buddha Venkanna: రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి మాజీ సభ్యుడు బుద్ధా వెంకన్న మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు తనకు అన్యాయం చేయబోరని తేల్చి చెప్పారు.

ఈ ఉదయం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏదైనా ఒక చోటి నుంచి తాను పోటీ చేయాలని భావిస్తోన్నానని బుద్ధా వెంకన్న వెల్లడించారు. ఈ రెండింట్లో ఒకటి తనకు కేటాయించాలని చంద్రబాబుకు కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు.

TDP leader Buddha Venkanna demands Vijayawada West assembly or Anakapalli MP seat

ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తనకు అన్యాయం చేయబోడనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు తనను పక్కన పెట్టే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు. అందుకే- ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటున్నానని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

ఈ రెండింట్లో ఏదైనా ఒక నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని కోరుతూ చంద్రబాబు పోస్టర్‌కు బుద్ధా వెంకన్న తన రక్తంతో అభిషేకించారు. పాకెట్‌లో తీసుకొచ్చిన రక్తంలో బ్రష్‌ను ముంచి.. సీబీఎన్ జిందాబాద్, నా ప్రాణం అర్పిస్తా అనే అక్షరాలను గోడలపై రాశారు. అనంతరం చంద్రబాబు పోస్టర్‌ పాదాలకు రక్తాన్ని పూసి, తన అభిమానాన్ని చాటుకున్నారు.

పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని జనసేనకు కేటాయించడం ఖాయం అంటూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బుద్ధా వెంకన్న ఈ డిమాండ్‌ను తెర మీదికి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనకాపల్లి ఎంపీగా జనసేన నేత నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

TDP leader Buddha Venkanna demands Vijayawada West assembly or Anakapalli MP seat

విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2009, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ ఓడిపోయారు.

వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లి.. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారు. విజయవాడ వెస్ట్ స్థానాన్ని మైనారిటీ నాయకుడికి కేటాయించింది వైఎస్ఆర్సీపీ. షేక్ ఆసిఫ్ ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో- ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇస్తోన్నారు బుద్ధా వెంకన్న.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+