జగన్‌పై హత్యాయత్నం అనుమానాలు: కొడాలి నాని, వంశీ కుట్ర: ప్రశాంత్ కిషోర్ స్కెచ్‌: బుద్ధా వెంకన్న

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఘాటు విమర్శలు సంధించారు. వైఎస్ కుటుంబంపైనా పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి ఒక కులం ప్రయత్నిస్తోందంటూ ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో వర్గ పోరుకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వేసిన వ్యూహాల్లో భాగంగా వైసీపీ నేతలు ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు.

 ఇంటిదొంగలను పట్టుకో..

ఇంటిదొంగలను పట్టుకో..

గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీలోని కొందరు కీలక నాయకులు వైఎస్ జగన్‌ ఎప్పుడు అరెస్ట్ అవుతారా.. తాము ముఖ్యమంత్రి కుర్చీని ఎప్పుడు దక్కించుకుందామా అని ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తోన్న ఏబీఎన్ రాధాకృష్ణ వంటి మీడియా సంస్థల యజమానులపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తన ఇంట్లోనే వైఎస్ జగన్ దొంగలను పెట్టుకున్నారని, ముందు వారిపై దృష్టి పెట్టాలని అన్నారు.

వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆ సామాజిక వర్గం నేతలే..

వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆ సామాజిక వర్గం నేతలే..

తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గానికి పరిమతం చేయడంలో భాగంగా వైసీపీ కొత్త కుటిల ప్రయత్నాలకు తెర తీసిందని బుద్ధా వెంకన్న విమర్శించారు. అదే సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, కొడాలి నాని వంటి నాయకులు కూడా వైఎస్ జగన్‌ను హతమార్చే కుట్రలో భాగస్వామ్యులుగా ఉన్నట్టా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కుటుంబమేనని చెబుతారని అన్నారు.

తండ్రి చావును రాజకీయాల కోసం..

తండ్రి చావును రాజకీయాల కోసం..

వైఎస్ జగన్ తన పార్టీని స్థాపించిందే సానుభూతి పునాదులపైన అని బుద్ధా వెంకన్న చెప్పారు. తన తండ్రి చనిపోయినప్పుడు, ఆ సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి వైఎస్ జగన్ ప్రయత్నించింది వాస్తవమా? కాదా? అని నిలదీశారు. తండ్రి చావును తన రాజకీయ భవిష్యత్ కోసం వైఎస్ జగన్ వాడుకున్నాడని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి కోడికత్తి డ్రామాను నడిపించారని విమర్శించారు. ఆయన రాజకీయ వికృత క్రీడలో మరో ప్రధానమైన ఘట్టం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతమని చెప్పారు.

 సింహాల్లా చీల్చి చెండాడుతాం..

సింహాల్లా చీల్చి చెండాడుతాం..


వైఎస్ వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో..వారిని ఎవరు కాపాడుతున్నారో.. అందరికీ తెలుసని బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీ కుక్కలు భౌభౌమంటూ చంద్రబాబు గురించి మొరిగితే.. సింహాల్లా చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే, చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో తమ పార్టీకి చెందిన 40 మంది హత్యకు గురయ్యారని, దీన్ని బట్టి చూస్తే హత్యా రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అర్థమౌతుందని అన్నారు.

 అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలా..

అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలా..

వైసీపీకి ఒక సిద్ధాంతం అంటూ ఏదీ లేదని, అధికారంలోకి రాక ముందు ఒకలా, ఆ తరువాత మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇలా రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించడం ముఖ్యమంత్రి, ఆయన పార్టీ నాయకులకు అలవాటేనని అన్నారు. అధికారంలోకి రాక ముందు తన తండ్రి చావుకు రిలయన్స్ కారణమని ఆరోపించిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ మోచేతి నీళ్లు తాగుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి రిలయన్స్ ప్రతినిధిని రాజ్యసభకు పంపించడమే నిదర్శనమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+