Chandrababu: జగన్ ఇంటికెళ్లడం ఖాయం.. గురజాల సభలో చంద్రబాబు..

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో శనివారం రా కదిలిరా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత సమక్షంలో శ్రీకృష్ణదేవరాయల సైకిలెక్కారు. ప్రజలంతా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాకు సంబంధించి వరికిపుడిసేల ఎత్తిపోతల పథకాన్ని అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో కులం, మతం చూడకుండా మంచి చేసే నాయకుడికి ఓటు వేయాలన్నారు. యరపతినేని పార్టీ కోసం ఎంతో చేశారని గుర్తు చేశారు. జగన్ బాబాయ్ ఎవరో చంపారో ఇప్పటికైనా చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హత్యలు చేసేవారు రాజకీయాల్లోకి వస్తే ప్రమాదన్నారు. సీఎం జగన్ ది యూజ్ అండ్ త్రో పాలసీ అని అన్నారు. వైసీపీని ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

TDP leader Chandrababu participated in Gurjala Ra Kadalira Sabha

40 రోజుల్లోగా జగన్ ఇంటికి వెళ్తాడని చంద్రబాబు జోస్యం చెప్పారు. తాడేపల్లిగూడెం, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్, బెంగళూరులో జగన్ ప్యాలెసులున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వైజాగ్ రుషికొండలో మరో ప్యాలెస్ నిర్మించుకున్నారని చెప్పారు. జనసేన, టీడీపీలో విభేదాలు సృష్టించలేరని స్పష్టం చేశారు. వైసీపీ అప్పులపాలు చేస్తే.. టీడీపీ ఆదాయం సృష్టించే పార్టీ అని చెప్పుకొచ్చారు.

పల్నాడు జిల్లాలో 30 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలను హత్యలు చేశారని ఆరోపించారు. జిల్లాలోని నరహంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కోడెలను వేధించి ఆయన మృతికి కారణమయ్యారని ఆరోపించారు. ఎస్టీ మహిళను ట్రాక్టర్ తో ఢీకొట్టించి చంపారని తెలిపారు. ఎలాంటి తప్పు చేయని ప్రతిపాటి శరత్ అరెస్ట్ చేశారని అన్నారు. ఈ ఆటలు ఎన్నో రోజులు సాగవని చంద్రబాబు అన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+