టిడిపికి షాక్: వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ ఫరూక్ మేనల్లుడు ముస్తాక్
నంద్యాల: పోలింగ్‌కు మూడు రోజుల ముందే టిడిపికి వైసీపీ షాకిచ్చింది. టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మేనల్లుడు ముస్తాక్ టిడిపిని వీడి వైసీపీలో చేరారు.
సోమవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో ముస్తాక్ టిడిపిని వీడి వైసీపీలో చేరారు. నంద్యాలలో కీలకమైన ముస్లిం మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి.

అయితే ఈ తరుణంలో ఫరూక్ మేనల్లుడు టిడిపిని వీడడం ఆ పార్టీకి షాకిచ్చింది.వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విజయం కోసం కృషిచేస్తానని ముస్తాక్ ప్రకటించారు.
మరోవైపు ఓ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి కూడ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications