లోకేష్ తో జలీల్ ఖాన్ భేటీ - కీలక హామీ..!!
ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. ప్రధాన పార్టీలో హోరా హోరీగా పోరాటం చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ -జనసేన అభ్యర్దులను బరిలోకి దించాయి. ఈ సమయంలో విజయవాడ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. విజయవాడ పశ్చిమం సీటు పైన నేతల్లో పోటీ నెలకొంది. దీంతో..మాజీ ఎమ్మెల్యే తాజాగా నారా లోకేష్ ను కలిసారు. కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది.
విజయవాడ పశ్చిమం సీటు నుంచి టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జలీల్ ఖాన్ వైసీపీ నేతలను కలిసారు. ఈ సమయంలోనే టీడీపీ నేత కేశినేని చిన్ని నేరుగా జలీల్ ఖాన్ తో సమావేశమయ్యారు. త్వరలోనే చంద్రబాబు, లోకేష్ తో సమావేశం ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ భవిష్యత్ పైన హామీ ఇస్తుందని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో పార్టీ సూచన మేరకు నిర్ణయాన్ని మార్చుకొని జలీల్ ఖాన్ టీడీపీలోనే కొనసాగతున్నారు. ఈ రోజు జలీల్‍ఖాన్‍ను వెంటపెట్టుకుని లోకేశ్‍ను కేశినేని చిన్ని కలిసారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలని జలీల్ ఖాన్ ను నారా లోకేష్ కోరారు.
జలీల్ ఖాన్ భవిష్యత్ తనదేనన లోకేష్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు. లోకేష్ ఇచ్చిన హామీ..చర్చలో జలీల్ ఖాన్ టీడీపీ గెలుపు కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దత్తు కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబెడతానని నారా లోకేష్ కి స్పష్టం చేసారు. దీంతో, జలీల్ ఖాన్ పార్టీ మారుతున్నారనే ప్రచారానికి తెర పడింది.
విజయవాడ నగరం లోని మూడు సీట్లలో సెంట్రల్ బోండా ఉమా, తూర్పు సీటును గద్దే రామ్మోహన్ కు టీడీపీ కేటాయించింది. పశ్చిమం సీటే పైన పొత్తులో భాగంగా ఏ పార్టీ తీసుకోవాలి..ఎవరిని ఖరారు చేయాలనే అంశం పైన చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు అంశం తేలిన తరువాత మిగిలిన సీట్ల గురించి రెండు పార్టీలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications