Nara Lokesh : మహిళల కాళ్లు మొక్కిన నారా లోకేష్ ...!
ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ మహిళలతో భేటీ అయ్యారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కోసం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. ఇవాళ కూడా పీలేరు నియోజకవర్గంలో నడక కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన స్ధానికంగా ఉన్న మహిళా నేతలతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకున్నారు.
పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. పాదయాత్రలో వారితో కలిసి అడుగులో అడుగు వేశారు. వారి సమస్యలు విన్నారు. తనతో కలిసి ఫొటోలు దిగేందుకు వచ్చిన మహిళలు, యువతులతో కలిసి సెల్ఫీలు ఇచ్చారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాదయాత్ర విరామంలో స్ధానిక మహిళా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వివిధ రూపాల్లో మహిళలు అందిస్తున్న సేవలు, వివిధ రంగాల్లో రాణిస్తున్న తీరు, ఏపీలోనూ మహిళల పరిస్దితిపై నారా లోకేష్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. పీలేరులో మహిళలతో భేటీ అయిన నారా లోకేష్ పలు అంశాలపై వారితో మాట్లాడిన తర్వాత వారు చేస్తున్న సేవలకు పాదాభివందనం చేశారు. దీంతో అక్కడున్న మహిళలు కాసేపు ఆశ్చర్యపోయారు. అనంతరం లోకేష్ తో తమ సమస్యలు చెప్పుకున్నారు.













Click it and Unblock the Notifications