సీఐడీ కేసుల వేళ నారా లోకేశ్ కీలక నిర్ణయం - ఏం జరుగుతోంది..!!
టీడీపీ ముఖ్య నేతలపై కేసుల ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు(Chandra Babu) ఇప్పటికే 17 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేశ్(Lokesh) ను ఏ 14గా చేర్చుతూ సీఐడీ(CID) కోర్టులో మొమో దాఖలు చేసింది. దీంతో, లోకేశ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో లోకేశ్ తాను ఢిల్లీ(Delhi)లో ఉన్నానని..ఇక్కడకు వచ్చి అరెస్ట్ చేయలేరా అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏ 14 గా లోకేశ్: చంద్రబాబు అరెస్ట్ తరువాత నుంచి లోకేశ్(Lokesh) అరెస్ట్ ఖాయమంటూ నేరుగా మంత్రులే చెబుతూ వచ్చారు. చంద్రబాబు(Chandra Babu) కేసులో సుప్రీంలో ఈ రోజు విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలిసారు. పార్టీ నేతలతో వరుస మంతనాలు జరుపుతూ కార్యాచరణ నిర్దేశించారు.

తరువాత పవన్(Pawan Kalyan) తో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. పవన్ పొత్తు ప్రకటన చేసారు. తరువాత ఢిల్లీలో మకాం వేసిన లోకేశ్ తాజాగా రాష్ట్రపతిని కలిసారు. చంద్రబాబు కేసులో న్యాయ నిపుణలతోనూ చర్చలు చేసారు. తాను ఆరు నెలల్లో సీఎం జగన్(CM Jagan) కు రిటర్న్ గిఫ్ఠ్ ఇస్తానంటూ వ్యాఖ్యానించారు.
యాత్ర ప్రారంభం: చంద్రబాబు అరెస్ట్ తో లోకేశ్ తన యువగళం యాత్రను ఈ నెల 9వ తేదీన నిలుపుదల చేసారు. ఇక, ఇప్పుడు లోకేశ్(Lokesh) పైన కేసులు నమోదు అవుతున్న సమయంలో సీఐడీ అడుగుల పైన ఉత్కంఠ పెరుగుతోంది. లోకేశ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలోనే నారా లోకేశ్ యువగళం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసారు.
ఎక్కడైతే లోకేశ్ యాత్ర నిలిచిందో తిరిగి అక్కడనుంచే శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు నారా లోకేశ్(Nara Lokesh) తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achamnaidu) అధికారికంగా ప్రకటించారు. లోకేశ్ పాదయాత్రను అక్రమ కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అయినా పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే ఇది ప్రారంభం అవుతుందని చెప్పారు.

కేసులతో ఉత్కంఠ: దీనికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకొన్నామని ఆయన చెప్పారు. జనసేన(Janasena) పార్టీతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులపై మరింత ఉధృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లోకి మరింతగా వీటిని తీసుకువెళ్లాలని టీడీపీ నేతల సమావేశం నిర్ణయించింది.
ఈ రోజు సుప్రీంలో చంద్రబాబు కేసు విచారణకు రానుండటంతో రిలీఫ్ దొరుకుతుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. ఇటు ఏసీబీ కోర్టు(ACB Court)లోనూ చంద్రబాబు కస్టడీ..బెయిల్ పైన విచారణ జరగనుంది. ఎన్నికల వేళ కేసుల వేళ..యాత్ర కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించటంతో రాజకీయంగా మరింత ఉత్కంఠ పెరుగుతోంది












Click it and Unblock the Notifications