ఆ అసెంబ్లీ స్థానం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ: ప్రకటించిన సునీత: వైసీపీ యంగ్ ఎమ్మెల్యేతో ఢీ
అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లా రాజకీయాలపై గట్టిపట్టు ఉన్న పరిటాల కుటుంబం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలను మొదలు పెట్టడమే దీనికి కారణం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే.. తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంది పరిటాల ఫ్యామిలీ. ఈ విషయంపై పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ప్రమేయం లేకుండానే అసెంబ్లీ స్థానాలను సెలెక్ట్ చేసుకుందనే ప్రచారం జిల్లాలో ఉంది.

పెనుకొండను వీడటంతో..
నిజానికి- అనంతపురం దక్షిణ ప్రాంతంలోని నియోజకవర్గాలపై పరిటాల కుటుంబానికి గట్టిపట్టు ఉంది. ఈ ప్రాంతంలోని నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉండేవి. పెనుకొండ.. పరిటాల కుటుంబానికి పెట్టని కోట. పరిటాల రవీంద్ర మూడుసార్లు ఈ స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తిరుగులేని ఆధిక్యంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తుంటారు. 1983 నుంచి ఇప్పటిదాకా పెనుకొండలో రెండుసార్లు మాత్రమే టీడీపీ ఓడిపోయిందంటే.. ఈ స్థానంపై ఆ పార్టీకి ఉన్న ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఎస్సీ రిజర్వుడ్‌గా
అనంతరం ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో ఈ నియోజకవర్గాన్ని పరిటాల కుటుంబం వీడాల్సి వచ్చింది. 2009లో ఎస్సీ రిజర్వుడ్ కావడంతో బీకే పార్థసారథి టీడీపీ నుంచి రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఈ స్థానంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసింది. మంత్రి శంకర నారాయణ సొంత నియోజకవర్గం ఇది. బీకే పార్థసారథి క్రీయాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. ఈ నియోజకవర్గాన్ని వీడిన తరువాత కూడా తన పట్టును కోల్పోలేదు పరిటాల కుటుంబం.

రాప్తాడులో ఘోర ఓటమి..
పెనుకొండ ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో పరిటాల కుటుంబం.. రాప్తాడు నియోజకవర్గానికి వలస వెళ్లాల్సి వచ్చింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి పరిటాల సునీత ఈ స్థానం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలో దింపారు. చేదు ఫలితాన్ని చవి చూశారు. తన అరంగేట్రం ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ దారుణంగా పరాజయాన్ని చవి చూశారు. 25 వేలకు పైగా ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతులో ఓటమి పాలయ్యారు.

రాప్తాడులో మారిన ఈక్వేషన్లు..
ఆ తరువాత రాప్తాడు నియోజకవర్గంలో సమీకరణాలు భారీగా మారిపోయాయి. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నే కొత్తపల్లి, రామగిరి మండలాల్లో వైసీపీ బలపడింది. ప్రత్యేకించి- పేరూరు రిజర్వాయర్‌కు కర్ణాటక నుంచి అదనపు నీటిని విడుదల చేయించుకోవడంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించడంతో.. ఈ ప్రాంతలో ఆయన పేరు మారుమోగిపోతోంది. దశాబ్దాల నాటి కలను తోపుదుర్తి సాకారం చేశారంటూ ఈ ప్రాంత రైతులు, ఇతర వర్గాల వారు అభిమానిస్తున్నారు.

తోపుదుర్తిని ఎదుర్కొనడం కష్టమే..
ఈ పరిణామాలతో తోపుదుర్తిని ఢీ కొనడటం కష్టమేనని పరిటాల కుటుంబం భావించినట్టుంది. అందుకే తన వ్యూహాన్ని మార్చుకుంది. పొరుగునే ఉన్న ధర్మవరం నియోజకవర్గంపై దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయడానికి సమాయాత్తమౌతున్నారంటూ కొద్ది రోజులుగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా శ్రీరామ్ ఈ నియోజకవర్గం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.

అధికారికంగా ప్రకటించిన సునీత..
తాజాగా- మరోసారి ధర్మవరం నియోజకవర్గంలో తల్లి పరిటాల సునీతతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నానని, ఆశీర్వదించాలని విజ్ఙప్తి చేశారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కదిరి పార్టీ ఇన్‌ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి దీనికి హాజరయ్యారు.

కేతిరెడ్డిని ఢీ కొట్టగలరా?
ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ స్థానంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. 15 వేలకు పైగా ఓట్ల తేడాతో జీ సూర్యనారాయణపై గెలిచారు. అనంతరం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు.
తరచూ ప్రజల్లో ఉంటోన్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో ప్రజలకు చేరువ అయ్యారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ కలియ తిరుగుతున్నారు. స్థానికులు ఎదుర్కొంటోన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తోన్నారు. అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నారని ఓటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. కేతిరెడ్డిని ఢీ కొట్టి పరిటాల శ్రీరామ్ గెలవగలుగుతారా? అనేది ఆసక్తి రేపుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications