విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ - అదానీకి లాభం కోసమే : పయ్యావుల ఫైర్...!!
సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఆర్దిక వ్యవహారాల పైన టార్గెట్ చేసిన పయ్యావుల ...ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల పైన కేంద్రీకరించారు. కేంద్రం ఆర్దిక వివరాలు కోరుతూ ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖ ను ఆయన బయట పెట్టారు.

ఆదానీకి లాభం చేకూర్చేందుకే
ఇక, ఇప్పుడు పయ్యావుల ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్ రాష్ట్రం రూ. 1.99కే సౌర విద్యుత్ కొనుగోలు చేసిందని, రూ. 2.49 ఏపీ కొనుగోలు చేయడం ఎంత వరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రూ. 2.49 ఏ విధంగా చౌక అవుతుందని ధ్వజమెత్తారు. రైతుల పేరుతో జరిగే ఈ విద్యుత్ కోనుగోళ్ల వ్యవహరం స్కీమ్ కాదు.. అదానీ లాభం కోసం చేసే స్కామ్ గా ఆరోపించారు.

రివర్స్ టెండరింగ్ ఏమందంటూ
ప్రభుత్వం పెట్టుకున్న రివర్స్ టెండరింగ్ ఏమైందని ప్రశ్నించిన పయ్యావుల.. జూడిషీయరీ ప్రివ్యూ ఏమైందని నిలదీసారు. రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను అదానీలకి నామినేషన్ పద్దతిలో ఇచ్చేశారు. ఏపీఈఆర్సీనే విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించాలి.. కానీ ఆ విధంగా చేయలేదు. సీఎంకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అంటూ పయ్యావుల ప్రశ్నించారు. 'టల్లోనే ప్రతిపాదనలు సిద్దం చేసి.. ఆమోదాలు ఏ విధంగా జరిగాయో బయట పెట్టాలని డిమాండ్ చేసారు. గతంలో గ్రిడ్ సేఫ్టీ లేదన్న ప్రభుత్వం.. ఇప్పుడు గ్రిడ్ ఎలా తట్టుకుంటుందని భావిస్తోందో స్పష్టం చేయాలన్నారు.

పయ్యావుల ప్రభుత్వం పై ఆరోపణలు
సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే నాటికి రూ. 2.49 కాదు.. అంతకంటే ఎక్కువే ఉందన్నారు. సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే సరికి రూ. 4.50 దాటినా ఆశ్చర్యం లేదని విశ్లేషించారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల పేదలు.. రైతులపై రూ. 1.20 లక్షల కోట్ల భారం పడనుందని పయ్యావుల చెప్పుకొచ్చారు. సెకీ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇతర రాష్ట్రాలకు మేలు చేకూరేలా చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను అదానీకి కట్టబెట్టినప్పుడు కోర్టు కొట్టేసి కొత్త టెండర్లు పిలమని చెప్పినా ఎందుకు పిలవలేదని పయ్యావుల నిలదీసారు.

సెకీ రూపంలో ఆదానీకి కట్టబెట్టారు
అదానీకి ఇక్కడ దక్కని టెండర్లను.. సెకీ రూపంలో కట్టబెట్టారన్నాంటూ ఆరోపించారు. ఏపీలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నా.. పక్క రాష్ట్రాల్లో లబ్ది కలిగించడం దేనికని, ఈ స్కీమ్ అమలు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలోనే సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలని డిమాండ్ చేసారు. పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్లో కోతలు విధించి రూ. 1.19కే అందిస్తోందని గుర్తు చేసారు. ఏపీలో అంతకు మించి అవకాశం ఉన్నా.. ఎందుకు చేయడం లేదని పయ్యావుల ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసారు.












Click it and Unblock the Notifications