శ్రీకాకుళంలో దారుణం: టీడీపీ నేత కుమారుడి దారుణ హత్య!
శ్రీకాకుళం: జిల్లాలోని సరవకోట మండలం గుమ్మపాడులో స్థానిక టీడీపీ నేత కత్తిరి వెంకటరమణ కుమారుడు హర్షవర్దన్(7) దారుణ హత్యకు గురయ్యాడు. హత్య వెనుక కారణాలేవి తెలియరాలేదు. అయితే పాత కక్షలతో బంధువులే బాలుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బాలుడి హత్యతో వెంకటరమణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. చుట్టుపక్కలవాళ్లు సైతం వారి రోదనకు కంటతడి పెట్టుకున్నారు. ఏడేళ్ల బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. వెంకటరమణపై కక్షతోనే ఆయన కుమారుడిని హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుని తీరుతామని తెలిపారు. పలువురు టీడీపీ నేతలు వెంకటరమణ కుటుంబాన్ని ఓదార్చి వారికి ప్రగాడ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications