వైభవంగా వంగవీటి రాధా నిశ్చితార్దం - వివాహ ముహూర్తం ఖరారు..!!
టీడీపీ నేత వంగవీటి రాధా పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాధా - పుష్ఫవల్లి వివాహ ముహూర్తం ఖరారైంది. గత నెలలోనే రాధా వివాహ వార్త బయటకు వచ్చింది. ఈ రోజు నర్సాపురంలో ఇరు వైపుల బంధువుల సమక్షంలో నిశ్చితార్ధ వేడుక వైభవంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా నిశ్చితార్ధ వేడుకకు పలువురు హాజరయ్యారు. అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం వంగవీటి రాధా వివాహం జరగనుంది. దీంతో, అభిమానుల్ల జోష్ మొదలైంది.
ఘనంగా నిశ్చితార్ధం : వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లిలా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ తో పాటు నరసాపురం కు చెందిన పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాని 1987-92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. ఉన్నత విద్య హైదరాబాడ్ లో పూర్తి చేసారు. హైదరాబాద్ లో యోగా టీచర్ గానూ పని చేసారు.
అక్టోబర్ 22న వివాహం : పుష్పవల్లి తండ్రి టీడీపీ లో సుదీర్ఘ కాలం పోషించారు. మధ్యలో కొంత కాలం హైదరాబాద్ కు వెళ్లిపోయారు. తిరిగి నర్సాపురం వచ్చి అక్కడే ఇంటి నిర్మాణం చేపట్టారు. కొంత కాలం క్రితం జనసేనలో చేరారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయ్యారు. గత నెలలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లొ వారాహి యాత్ర సమయంలో నర్సాపురంలో ఉన్న సమయంలో వీరి ఇంటిలోనే బస చేసారు.
నరసాపురంలో ఘనంగా వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుక..!#VangaveetiRanga #VangaveetiRadha #Engagement #AndhraPradesh #Narasapuram #Oneindiatelugu pic.twitter.com/QlZlcVoNpQ
— oneindiatelugu (@oneindiatelugu) September 3, 2023
ఆ సమయంలో తమ కుమార్తె వివాహం విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. జనసేన ఇన్‌ఛార్జ్ నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం వంగవీటి రాధా వివాహం ఖరారు సమయంలో మధ్యవర్తిత్వం వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లొ పోటీకి సమాయత్తం : ఇక, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రాధా వివాహం ఖరారైంది. రాధా జనసేనలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా నారా లోకేశ్ యువగళం యాత్రలోనూ పాల్గని రాధా తన మద్దతు ప్రకటించారు. అయితే, వివాహం తరువాత రాజకీయంగా రాధా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ రాధా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. కోరుకుంటున్నట్లు గా విజయవాడ సెంట్రల్ నుంచి బరిలో ఉంటారా..లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications