అనుచరులతో వంగవీటి రాధా సమావేశం - కీలక నిర్ణయం..!?
వంగవీటి రాధా రాజకీయంగా తన నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమయ్యారు. ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసారు. ప్రస్తుతం టీటీడీపీ లో ఉన్న రాధా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయటం ఆసక్తి కరంగా మారుతోంది. రాధా సోదరి పొలిటికల్ ఎంట్రీ పైన ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రాధా జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ పైన రాధా ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
రాధా ఏం తేల్చబోతున్నారు : విజయవాడ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వంగవీటి రాధా తన అనచరులతో సమావేశం కానుండటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. 2019 ఎన్నికల వేళ వైసీపీని వీడిన వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లొ సీటు దక్కలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పినా అమలు కాలేదు. కొంత కాలంగా రాధాను జనసేన చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయి.

నాదెండ్ల మనోహర్ నేరుగా రాధాతో సమావేశం అయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి రాధా పోటీ చేసారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రాధా తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించి..నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.
జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా : వంగవీటి రాధా సోదరి సైతం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. దీని పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు రాధా టీడీపీలో కొనసాగినా..ఆయన కోరకొనే విజయవాడ సెంట్రల్ సీటు దక్కే అవకాశం లేదు. అక్కడ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమాకు ఇప్పటికే హామీ దక్కినట్లు చెబుతున్నారు.
టీడీపీ, జనసేన పొత్తులో పవన్ పట్టుబడితే మినహా జనసేనలో చేరినా రాధాకు ఆ సీటు కేటాయించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. రాధాను ఆహ్వానించేందుకు ఆ విధమైన హమీ ఇచ్చేందుకు జనసేన నాయకత్వం సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. అటు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

పోటీ ఎక్కడ నుంచి : వైసీపీలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగినా.. రాధా ప్రస్తుతం జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయినా జనసేన నేతగా ఉండటానికే రాధా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు సాధ్యం కాకుంటే ఏం చేయాలనే దాని పైన ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్య అనుచరులకు రాధా ఆహ్వానం పంపటంతో..వారితో ప్రస్తుత రాజకీయాల పైన చర్చ..రాజకీయంగా ఉన్న అవకాశాల పైన చర్చించి వారి అభిప్రాయాలు సేకరిస్తారని తెలుస్తోంది. ఆ తరువాత రాధా తాను టీడీపీలో కొనసాగటమా, మరో పార్టీలో చేరటమా అనే అంశం పైన క్లారిటీ ఇస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications