Pithapuram: పిఠాపురంలో గెలుపు ఎవరిది..!

ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సోమవారం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రజలంతా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా లేదా అనేదిపై దృష్టి పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా పిఠాపురంలో ఎవరు గెలుస్తారని మాట్లాడుకుంటున్నారు. పిఠాపురంలో కూటమి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. వైసీపీ నుంచి వంగా గీత బరిలో నిలిచారు. పిఠాపురం ఫలితాలపై టీడీపీ నేత వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురంలో జనసేన గెలిచి తీరుతుందని వర్మ అన్నారు. నటుడు నాగబాబు పిఠాపురం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు పక్కా అని.. మెజారిటీ అనేది తర్వాత విషయమన్నారు. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదన్నారు. మెజార్టీ ఎంతైనా గెలుస్తామని నమ్మకం ఉందని నాగబాబు స్పష్టం చేశారు. స్వేచ్ఛపూరితమైన వాతావరణం కోసం డెమొక్రటిక్ అయిన పాలన కోసం ప్రజలంతా కలిసి వైసీపీని దింపేయాలని కంకణం కట్టుకున్నారన్నారని పేర్కొన్నారు.

TDP leader Verma said who will win in Pithapuram

ఎర్రకండువ అనేది జనసేన జెండా కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఎర్రజెండా వేసుకుంటున్నారు కాబట్టి దానికి అంత పాపులారిటీ వచ్చిందని చెప్పారు. అయితే పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని జనసేన కార్యకర్తలు బలంగా చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా పవన్ కల్యాణ్ గెలిచి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ 4న ఎవరు గెలుస్తారో తెలిపోతోంది. అంతుకు ముందు అంటే జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+