Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ - ఇలా ముందుకెళ్తాం..!!

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌పై ఉన్న టీడీపీ అధినేతతో ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఆమెతో పాటు కోడలు నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఆరోగ్యం పైన ఆరా తీసారు. లోకేశ్ లేఖ ఆధారంగా చంద్రబాబుకు జైలు అధికారులు భద్రత పెంచారు. ఇక, రాజకీయంగా అమలు చేయాల్సిన కార్యాచరణ పైన యనమల కు చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు.

చంద్రబాబు అరెస్ట్ అయిన సమయం నుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే బస చేసారు. లోకేశ్ ఢిల్లీలో ఉండటంతో బ్రాహ్మణి అక్కడే భువనేశ్వరితో పాటుగా ఉంటున్నారు. ఈ రోజు జైలులో చంద్రబాబుతో ఆ ఇద్దరు యనమలతో కలిసి భేటీ అయ్యారు. అంతకుముందు రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Chandrababu Brahmani Bhuvnaneswari

ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. లోకేశ్ అటు పార్లమెంట్ ప్రాంగణంలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ రాత్రికి రాజమండ్రి చేరుకొనే అవాకాశం కనిపిస్తోంది.

ఇక, పార్టీ సీనియర్ నేత యనమలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఇద్దరి మధ్య రాజకీయ - న్యాయ పోరాటం పైన చర్చ జరిగింది. ఫేకు కేసుతో జాతీయ గుర్తింపు ఉన్న నేతను ఇరికించి జైలులో పెట్టారని యనమల ఆరోపించారు. చంద్రబాబు బాధతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయని నేత తప్పు చేసినట్లు చిత్రీకరించి జైలులో పెట్టారని విమర్శించారు. చంద్రబాబును వేధించి, హింసిస్తున్నారని ప్రజలు గుర్తించారన్నారు.

కార్యకర్తల గురించే చంద్రబాబు ఆరా తీసారని చెప్పుకొచ్చారు. కార్యకర్తలు ఎలా ఉన్నారని అడిగారని చెప్పారు. చంద్రబాబు సీఎం అయిన సమయం నుంచి రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దారన్నారు. నష్ట పోతున్న ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారని వివరించారు. ప్రజల సంక్షేమం..భవిష్యత్ గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పారు.

Yanamala Ramakrishnudu

తన అక్రమ అరెస్ట్ ను ఖండించి..మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పమన్నారని యనమల చెప్పుకొచ్చారు. చంద్రబాబు గదిలో ఏసీ లేదని, అవకాశం లేదని చెబుతున్నారన్నారు. ఏసీ పెడితే బాగుంటుందని అడిగామని వెల్లడించారు. పార్లమెంట్ లో నిరసన చేస్తున్నారు. అక్కడ చేయటం ద్వారా దేశం మొత్తం తెలుస్తుందన్నారు.

21 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీలో అమలు చేయాల్సిన వ్యూహం పైన చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి వ్యూహం నిర్ణయిస్తామని చెప్పారు. కోర్టులో ఏం జరుగుతుందనేది ముందుగా మాట్లాడలేమన్న యనమల.. ఎవరి మీద కేసులు పెట్టుకున్నా సిద్దమే రాజకీయంగా, న్యాయ పరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+