తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్ టూ తిరుపతికి కావడి యాత్ర: బాబు కోసం వీరాభిమాని ఇలా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019లో ఏపీలో చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని కోరుతూ టిడిపి రైతు విభాగం ఉపాధ్యక్షుడు సోలిపురం ఏసుదేవరెడ్డి హైద్రాబాద్‌ నుండి తిరుపతికి కావడి యాత్రను నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే తరహలో పలు యాత్రలను నిర్వహించారు ఏసుదేవరెడ్డి.

మోకాళ్ళపై దేవాలయాలకు చేరుకోవడం, పాదయాత్రలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏసుదేవరెడ్డి వార్తల్లో నిలిచారు. ఏసుదేవరెడ్డి .

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏసుదేవరెడ్డి పార్టీలోనే కొసాగుతున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కావాలని పలు దేవాలయాలకు మోకాళ్ళపై వెళ్ళి పూజలు నిర్వహించారు ఏసుదేవరెడ్డి.

కావడియాత్ర నిర్వహిస్తున్న ఏసుదేవరెడ్డి

కావడియాత్ర నిర్వహిస్తున్న ఏసుదేవరెడ్డి

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనీ, చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని కోరుతూ ఆయన "కావడి యాత్ర''ను చేపట్టారు. హైదరాబాద్‌లో మొదలైన ఈ యాత్ర తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరుని సన్నిధి వరకూ కొనసాగుతుంది. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్ దగ్గర యాత్రను ప్రారంభించారు.

పలు యాత్రలు నిర్వహించిన ఏసుదేవరెడ్డి

పలు యాత్రలు నిర్వహించిన ఏసుదేవరెడ్డి

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఏసుదేవరెడ్డి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఎంత పెద్ద గుడికి మోకాళ్ళపై చేరుకొనేవారు. కొన్ని సమయాల్లో పాదయాత్ర చేస్తానని ఆయన మొక్కుకొనేవారు. 2014 ఎన్నికల సమయంలో కూడ ఏసుదేవరెడ్డి ఇదే తరహలో యాత్ర నిర్వహించారు.2019లో చంద్రబాబునాయుడుసీఎం అయ్యారు. కానీ, తెలంగాణలో టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇద్దరు మినహ పార్టీని వీడారు.

టిడిపికి వీరాభిమాని

టిడిపికి వీరాభిమాని

ఏసుదేవరెడ్డిది తుంగతుర్తి నియోజకవర్గం. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైద్రాబాద్లో జీవనం సాగిస్తున్నారు.ఏసుదేవరెడ్డి పార్టీ కోసం పలు కార్యక్రమాలను నిర్వహించారు.పార్టీ చిల్లిగవ్వ ఇవ్వకున్నా కూడ ఆయన తన మొక్కులను ఎంత శ్రమకు ఒర్చుకొని పూర్తి చేసేవారు. ఏసుదేవారెడ్డి బంధువులు పలు పార్టీల్లో ఉన్నారు. కానీ, ఆయన మాత్రం టిడిపిని వీడలేదు.

నామినేటేడ్ పదవులివ్వాలి

నామినేటేడ్ పదవులివ్వాలి


పార్టీ కోసం కష్టపడేవారికి నామినేటేడ్ పదవులను ఇచ్చి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. పార్టీ కోసం పనులు వదులుకొని డబ్బులు ఖర్చు చేసి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏసుదేవరెడ్డి లాంటి వారికి నామినేటేడ్ పదవులను కట్టబెట్టాలనే డిమాండ్ కూడ లేకపోలేదు.

English summary
Tdp leader Yesu deva reddy conducting Padayatra from Hyderabad to Tirupati. vasudeva reddy conducting padayatra for Chandrababu Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X