కుప్పం టీడీపీలో టెన్షన్

వైనాట్ 175 నినాదంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన. ముఖ్యంగా టీడీపీ బలంగా నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు. పిఠాపురం, మంగళగిరి, హిందూపురం నియోజకవర్గాల్లో గెలుపు కోసం అధికార పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేయబోయే కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. కుప్పంలో టీడీపీ అధినేత ఓటమికి అధికార పార్టీ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది.

కుప్పంను టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీని గెలిపించే బాధ్యత పెద్దిరెడ్డి భుజానికి ఎత్తుకుంటే చంద్రబాబు గెలుపు కోసం నారా ఫ్యామిలీ నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం ఫైట్ ఆసక్తికరంగా మారింది.1989 నుంచి వరుస విజయాలు నమోదు చేస్తున్న చంద్రబాబుకు 2024 ఎన్నికలు సీరియస్‎గా మారాయి. గతం కంటే భిన్నంగా టీడీపీ కేడర్ ఈ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా చంద్రబాబు గెలుపు కోసం నారా, నందమూరి ఫ్యామిలీలు రంగంలోకి దిగాయి.

TDP leaders are getting tensed in kuppam

అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ వస్తోంది.దీంతో వైనాట్ కుప్పం అనే నినాదంతో నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు వైనాట్ 175 అనడంతో అలర్ట్ అయిన టీడీపీ.. కుప్పం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో తన గెలుపు బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించిన చంద్రబాబు..ఇప్పుడు ఆయన గెలుపు కోసం స్వయంగా నారా ఫ్యామిలీనే రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

చంద్రబాబు తరుపున నామినేషన్ వేసిన భువనేశ్వరి ఆ తర్వాత సోదరుడితో కలిసి కుప్పంలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విస్తృత ప్రచారం చేసి కేడర్‎కు దిశా నిర్దేశం చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓటమి సంకేతాలు రావడంతోనే నారా ఫ్యామిలీ ఇలా కుప్పంలో మకాం వేశారని వైసీపీ నేతలు ఎద్దెవా చేస్తున్నారు మరోవైపు కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి తిష్టం వేయడంతో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరీ కుప్పం ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+