కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప విషయంలో టీడీపీ ఫుల్లు హ్యాపీ?

|
Google Oneindia TeluguNews

కడప జిల్లా విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే గత ఎన్నికల సమయంలో అంతా తానై చక్రం తిప్పిన సీఎం రమేష్ పార్టీలో లేకపోవడం.. బీజేపీలో ఉండటం. అందుకే నాయకులంతా సంతోషంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎవరికి ఏ టికెట్, ఎక్కడ ఇవ్వాలి, ఎంపీగానా? ఎమ్మెల్యేగా పోటీచేయించాలా?... లాంటి నిర్ణయాలతో చంద్రబాబునాయుణ్ని అతను ప్రభావితం చేశారు.

గత ఎన్నికల పరిస్థితి ఇప్పుడు లేదు

గత ఎన్నికల పరిస్థితి ఇప్పుడు లేదు


గత ఎన్నికలకు ముందు టీడీపీకి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. టికెట్లు రాక ఎంతోమంది నిరుత్సాహానికి గురయ్యారు. అయితే అంత నిరుత్సాహానికి కారకుడైన సీఎం రమేష్ పార్టీలో లేకపోవడంతో నేతలంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే దశలో ఉన్నారు. ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉంటే కడప ఎంపీగా పోటీచేయించాలనే ప్రతిపాదన చేసిందే సీఎం రమేష్. తర్వాత అధికారంలోకి వస్తే తన అనుచరుడికి మంత్రి పదవి ఇప్పించుకోవడానికి, తెలివిగా ఆదిని తప్పించడానికి రమేష్ ఆడిన నాటకమని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ చెబుతుంటారు.

బలహీనమైన వ్యక్తులకు టికెట్లు

బలహీనమైన వ్యక్తులకు టికెట్లు


కడప జిల్లాకు సంబంధించి రమేష్ సూచించినవారికే టికెట్లు దక్కాయి. ఆర్థికంగా పార్టీని ఆదుకున్నాడన్న కారణంతో ఆయన మాటకు అధిష్టానం విలువిచ్చింది. ఎంపీ ఖర్చు తాను భరిస్తానని చెప్పడంతో జమ్మలమడుగు టికెట్ ను ఆదికి కాదని రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. ఎన్నికలైన తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. ప్రొద్దుటూరు టికెట్ విషయంలో నంద్యాల వరదరాజులరెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు కాకుండా మల్లెల లింగారెడ్డి దక్కింది. అందులోను సీఎం రమేష్ దే ప్రధానపాత్ర అంటారు. ఆ సమయంలో వరదరాజులరెడ్డి రమేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

సర్వే ప్రకారమే టికెట్ల కేటాయింపు

సర్వే ప్రకారమే టికెట్ల కేటాయింపు

రమేష్ పార్టీలో లేకపోవడంతోపాటు రాబిన్ శర్మ సర్వే ప్రకారమే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంలో అధిష్టానం ఉంది. కేవలం డబ్బులు పెడతారనే కారణంతో బలహీనమైన వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెడితే గత ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో ప్రత్యక్షంగా అనుభవమైందని, జిల్లాలోని పది స్థానాలు వైసీపీకి అప్పగించేలా చేశారంటూ విమర్శలు వచ్చాయి. ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు లభిస్తాయని నేతలంతా ఆశాభావంతో ఉన్నారు.

English summary
All the leaders of the Telugu Desam Party are happy about Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X