Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖలో రైల్వే జోన్ కోసం టిడిపి నేతల దీక్ష...చంద్రబాబుపై మండిపడ్డ కన్నా

విశాఖపట్టణం:విభజన చట్టం హామీల్లో ఒకటైన విశాఖ రైల్వేజోన్ కోసం టీడీపీ ఎంపీల ఒక రోజు దీక్ష కొనసాగుతోంది. ఈ పోరాటం ద్వారా రైల్వే జోన్ అంశంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది. విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరుగుతుంది.

ఈ దీక్ష సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాలవాంఛ అయిన రైల్వేజోన్ పోరాటం, జోన్ ఆవశ్యకత, ప్రజాప్రయోజనాలపై ప్రత్యేకతపై టీడీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. కేకేలైన్‌తో కూడిన రైల్వే సాధనే లక్ష్యంగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా దీక్ష కొనసాగిస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు.మరోవైపు ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులను టిడిపి నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.

 రైల్వే జోన్...టిడిపి నేతల దీక్ష

రైల్వే జోన్...టిడిపి నేతల దీక్ష

రైల్వేజోన్ కోసం విశాఖలో టీడీపీ నేతలు ఒక్కరోజు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవంతి మాట్లాడుతూ హామీల అమలు కోసం నాలుగేళ్లు ఎదురుచూశామని, ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని ఎంపీ స్పష్టం చేశారు. ఎంపీలు ప్రధాని వద్దకు వెళ్తే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి రావాలని ఎంపీ అవంతి పిలుపునిచ్చారు. రైల్వేజోన్‌ కోరుకునే వారంతా టీడీపీ పోరాటానికి మద్దతివ్వాలని మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. రైల్వేజోన్‌ వస్తే విశాఖలోనే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని అన్నారు.

టిడిపిపై...మండిపడ్డ కన్నా

టిడిపిపై...మండిపడ్డ కన్నా

ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం మీరు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. చేనేత రుణాలు ఇప్పటివరకూ ఎందుకు మాఫీచేయలేదని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 300 క్లస్టర్లు ఏర్పాటు చేసిన ఘనత మోడీదే అన్నారు. అవినీతి పార్టీ టీడీపీ కావాలో, అభివృద్ధికి అద్దం పట్టే బీజేపీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని కన్నా పిలుపునిచ్చారు. అప్పట్లో వెంకయ్యనాయుడిని ఊరూరా తిప్పి సన్మానాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తుంగలో తొక్కి...ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని కన్నా దుయ్యబట్టారు.

 విపక్షాలపై...యనమల ఫైర్

విపక్షాలపై...యనమల ఫైర్

అయితే బీజేపీ, వైసీపీ, జనసేన కుట్రరాజకీయాలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్‌కు బీజేపీ వినతి చేయడం అంటే నమ్మకద్రోహానికి పరాకాష్ట అన్నారు. ఢిల్లీ డైరెక్షన్‌లోనే ఏపీ బీజేపీ నేతల రాష్ట్రపతి పాలన డిమాండ్ అని విశ్లేషఇంచారు. రాష్ట్రంపై పరోక్షంగా పెత్తనం చేయాలన్నదే బీజేపీ హైకమాండ్ కుట్ర అని యనమల ఆరోపించారు. అశాంతి సృష్టించేది తమరే...శాంతిభద్రతలపై ఫిర్యాదు చేసేది తమరే అని ధ్వజమెత్తారు. పవన్‌కళ్యాణ్‌తో ఉత్తరాంధ్ర ఉద్యమం అని రెచ్చగొట్టిస్తారని, జగన్‌తో కులాల చిచ్చు రగిలించాలని చూస్తారని మంత్రి యనమల దుయ్యబట్టారు.

 జగన్ విమర్శలు...హాస్యాస్పదం:నారాయణ

జగన్ విమర్శలు...హాస్యాస్పదం:నారాయణ

మరో రెండు నెలల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణాలు, పురోగతిని ప్రజలకు చూపిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో 25వేల కోట్లతో 1600 కి.మీ మేర రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతు కూలీల కోసం రాజధానిలో 7 వేల గృహాలు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు 5 వేల గృహాలు అందిస్తామని పేర్కొన్నారు. రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్న జగన్ విమర్శలు హాస్యాస్పదమని అన్నారు. ప్రతిపక్షాలు అమరావతికి వచ్చి చూస్తే అభివృద్ధి కనపడుతుందని మంత్రి నారాయణ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+