కార్పోరేషన్ కార్యాలయంలో తమ్ముళ్ల రచ్చ: కుర్చీల కోసం ఫైట్..

తాము కోరిన విధంగా కుర్చీలు వేయలేదన్న ఆగ్రహంతో మైకులను, కుర్చీలను టీడీపీ నేతలు విరగ్గొట్టినట్టుగా తెలుస్తోంది.

కడప: టీడీపీ సభ్యుల రచ్చతో కడప మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం రసాభాసగా మారింది. తాము కోరుకున్న విధంగా కుర్చీలు వేయలేదన్న కారణంగా మేయర్ పోడియం వద్దకు వెళ్లిన టీడీపీ కార్పోరేటర్లు సభలో గందరగోళం సృష్టించారు.

ఈ క్రమంలో టీడీపీ నేతలను వారించబోయిన వైసీపీ నేతలు వారించబోగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము కోరిన విధంగా కుర్చీలు వేయలేదన్న ఆగ్రహంతో మైకులను, కుర్చీలను టీడీపీ నేతలు విరగ్గొట్టినట్టుగా తెలుస్తోంది. కార్పోరేటర్ల నేమ్ ప్లేట్లను చెల్లా చెదురుగా విసిరేశారని సమాచారం.

Tdp leaders fight for chairs at kadapa corporation office

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు.. మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయానికి వచ్చి టీడీపీ నేతలకు నచ్చజెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీనిపై స్పందించిన వైసీపీ నేతలు.. టీడీపీ నేతలు కావాలనే ఆధిపత్య అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రతీ జిల్లాలోను టీడీపీ కార్పోరేటర్లు గొడవలకు దిగడం పరిపాటిగా మారిపోయిందని వైసీపీ నేతలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+