మోడీకి సొంత ఎంపీల భయం, సాక్షిలోనే రాశారు, కిలికి భాషలా: అమిత్ షాపై టీడీపీ

అమరావతి: బీజేపీ నమ్మకద్రోహం చేసిందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఆదివారం మండిపడ్డారు. అమిత్ షా లేఖ అంతా అబద్దాల పుట్ట అన్నారు. జిల్లాకు అధికంగా నిధులు ఇవ్వాలని తాము ఎన్నోసార్లు పార్లమెంటులో డిమాండ్ చేశామన్నారు. యూసీలు ఇవ్వలేదని అమిత్ షా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఆర్థిక నేరస్తులతో బీజేపీ సంబంధాలు కొనసాగించడం దారుణమన్నారు.

బీజేపీ తీరు అవమానించేలా ఉందని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీని వదులుకున్నందుకు బీజేపీ సిగ్గుపడాలన్నారు. అంటరాని పార్టీగా చూసే పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. తమ వల్లే బీజేపీ నేతలకు ఎన్నో పదవులు వచ్చాయన్నారు.

నరేంద్ర మోడీకి భయం పట్టుకుంది

నరేంద్ర మోడీకి భయం పట్టుకుంది

70 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో నిధులు వెనక్కి తెప్పించుకున్న సందర్భాలు లేవని నక్కా ఆనంద్ బాబు అన్నారు. బీజేపీతో పొత్తు వల్ల తాము 15 సీట్లు కోల్పోయామన్నారు. తాము అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీలోని (బీజేపీలోని) ఎంపీలు కొందరు మద్దతిస్తారని ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందన్నారు.

మోడీ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు

మోడీ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు

కేంద్రం ఏపీకి ఇచ్చింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అరాచకాలను ప్రశ్నించే వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి న్యాయం చేయాలన్న సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎదురుదాడి చేస్తోందన్నారు.

రాజమౌళి సినిమాలోని కిలికి భాషలా

రాజమౌళి సినిమాలోని కిలికి భాషలా

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లేఖలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని డొక్కా అన్నారు. వైసీపీ నేతలు మోడీకి సలాం చేస్తూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మద్దతిచ్చిన వారే ప్రధాని అవుతారని, ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే తమ మద్దతు అన్నారు. అమిత్ ,ా లఖ రాజమౌళి సినిమాలోని కిలికి భాషలా ఉందన్నారు.

సాక్షి పత్రికలోనే రాశారు

సాక్షి పత్రికలోనే రాశారు

టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే పార్టీలు బీజేపీకి మద్దతిస్తారంటూ ఇవాళ సాక్షి పత్రికలోనే రాశారని టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బీజేపీకి మద్దతు, ఇక్కడ హోదా అంటూ వైసీపీ నాటకాలు ఆడుతోందన్నారు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రధాని మోడీ కాళ్లు పట్టుకున్నారని, ఈ విషయం అందరికీ తెలుసునని సోమిరెడ్డి అన్నారు. రూ.46 వేల కోట్ల అవినీతి కేసుల్లో ఏ2గా ఉన్న విజయ సాయి రెడ్డిని ఎంపీ పదవి నుంచి ఎందుకు తొలగించలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+