జగన్, దావూద్, మాల్యా..: టిడిపి తీవ్ర వ్యాఖ్య, 'బ్రిటిష్ వారితో కలిసి వైయస్ ఫ్యామిలీ దారుణం'

విజయవాడ: 2019లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని బుధవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న అధ్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. తనకు పార్టీలో చేరే అవకాశమిచ్చినందకు చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

ప్రతిఒక్కరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని, గ్రామాల అభివృద్ధి జరగాలంటే ఫ్యాక్షన్ రాజకీయాలన్నింటిని వదిలిపెట్టి కలిసికట్టుగా అందరూ ముందుకు వెళ్లాలన్నారు. టిడిపికి చెందిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తానన్నారు.

రాబోయే రోజుల్లో టిడిపిలో క్రియాశీలకంగా పనిచేసి, జిల్లాలో ఉన్న అన్ని సీట్లను తమ పార్టీ గెలిచే విధంగా అందరం కలిసి కృషి చేద్దామన్నారు.

 TDP leaders hot comments on YS Jagan

బ్రిటిష్ వారితో చేతులు కలిపి: రాంగోపాల్

బ్రిటిష్ వారితో చేతులు కలిపి వైయస్ కుటుంబం అరాచకాలకు పాల్పడిందని కడప జిల్లా టిడిపి నేత రాంగోపాల్
రెడ్డి బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎంతోమందిని హత్య చేసిన చరిత్ర వైయస్ కుటుంబానికి ఉందన్నారు. జగన్ కుటుంబ చరిత్ర తెలిస్తే ప్రజలు దేశం నుంచి వెలివేస్తారని విమర్శించారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జగన్‌కు బాబుపై పుస్తకాలు వేసే నైతిక హక్కు లేదన్నారు.

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వైసిపి అధినేత జగన్ ఈ ముగ్గురూ ఒకేజాతికి చెందిన వారని ఏపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. వైసిపిని వీడిన 13 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలంటున్న జగన్ సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు.

అయితే, వైసిపి ఎమ్మెల్యేలు కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి లతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని సూచించారు. ఆర్థిక నేరస్తుడు జగన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+